Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, May 16, 2023

Day 17: Students Summer Holidays Activities


  

Day 17: Students Summer Holidays Activities


Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:17 Activities

Class: 1,2

17 వ రోజు 

To develop imitating skills

Q) Imitate the sounds of birds and animals.

తెలుగు:

Q) కింది వాక్యాలను చదువుతూ రాయండి.

👉 ఈ సీసా పాల సీసా.
👉 కాలి మీద చీమ పాకింది.
👉 బీర తీగ మీద కాకి వాలింది.
👉 నీలిమ పాట పాడింది.

English:

Q) Learn and wrire ' I ' words.

Ice cream    🍦

Ink                🔏

Iron               🧇

Insect           🐝

Island            🏝️

Maths:

Q) Write the following numbers in Descending order. ( Biggest  to Smallest )


1) 6, 8, 2

2) 14, 10, 15

3) 27, 20, 25

4) 48, 72, 35

5) 59, 46, 78

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Help = సహాయం.

Through = గుండా.

Much = చాలా.

Before = ముందు.

Line = గీత.

Right = కుడి.

Too = చాలా.

Mean = నీచమైన, సరాసరి, తలంచు.

Old = పాత,వృద్ద.

Any = ఏదైనా.

Same = కొంత.

Tell = చెప్పట.

Boy = బాలుడు.

Following =ఆదరించు

Came = వచ్చుట.








Class :3,4,5
17వ రోజు 

Q) కుందేలు మరియు తాబేలు కథ లోని కీలక పదాలను గుర్తించి ' సున్నా ' చుట్టండి. చదువుతూ 5 సార్లు  మీ నోటు పుస్తకం లో రాయండి. 

Q) Identify and circle the key words in the story  'The hare and the tortoise'. Read and write the key words 5 times in your note book.
👇👇👇
 





💎నేటి ఆణిముత్యం

ఎట్టిపనులు లేక ఏడాది యంతయు
సెలవలంచు గడుప సేమమగునె?
పనులు చేయకుండ బ్రతుకంత సోమరై
మునిగి తేలుచుంట ముప్పు తెచ్చు

భావము :
సంవత్సరంలో ఎక్కువకాలం సెలవులంటూ పనిచేయకుండటం మంచిది కాదు. అట్టివాడు జీవితాంతం సోమరిగా మారటం వల్ల కీడు ఏర్పడుతుంది.

🤘నేటి సుభాషితం

పెద్దవాళ్ళను సేవించడం వలన వినయం అలవడుతుంది.

🤠 నేటి సామెత 

లోగుట్టు పెరుమాళ్ళ కెరుక

మనసులో ఉన్నది దేవుడి తెలుసు మనకు తెలియదు. మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడే వారిని గురించి చెప్పిన సామెత.

🗣నేటి జాతీయం

ఈగలు తోలుకుంటున్నాడు

అంగట్లో బేరం లేదని అర్థం: ఉదా: వానికి బేరంలేక ఖాళీగా..... ఈగలు తోలుకుంటున్నాడు.

👬 నేటి చిన్నారి గీతం

మబ్బులు మబ్బులు

మబ్బులు పట్టేదెందుకు?
వానలు కురిసేటందుకు!
వానలు కురిసేనెందుకు?
పంటలు పండేటందుకు!
పంటలు పండేనెందుకు?
కడుపులు నింపేటందుకు!
కడుపులు నింపేనెందుకు?
అందరు బ్రతికేటందుకు!
అందరు బ్రతికేదేందుకు?
మంచిని పెంచేటందుకు!
మంచిని పెంచేదెందుకు?
అందరూ హాయిగ బ్రతికేటందుకు!
🎯DAY-17🎯

📒WE LOVE READING📒

🐀The Hungry Mouse🐀

💁‍♀️A mouse was having a very thought time. She had no food for many days and made strenuous efforts get her food. All her efforts went in vain. She looked everywhere to find her food. As the days pass by, she became very thin.

One day, the mouse found a basket with corns. She also noticed a tiny hole in the bas- ket, which was sufficient enough to move her in. She easi- ly moved inside the hole.

Since she had no foods for many days, she ate a large amount of corn. Without realizing her, she continuously ate more and more corns. She realized very later that she ate a lot more than she actually required. After eating a whole lot of corn, she became very fat!

Satisfied with corns, the fat mouse tried to come out of the basket through the small hole. Unfortunately, the tiny hole could not accommodate the big mouse!!!!

The mouse started screaming 'Oh god! Let me come out, how can I come out?'

A rat after hearing mouse's screaming voice from the basket, asked her what happened!

Mouse told the story and asked rat a solution. Rat told, 'if you want to come out the basket, wait for sometime or even days to lose your all your fat until you grow thin.'

Mouse started to starve now but with lots of food to come out of the trap!

🔮Moral: Anything too much is good for nothing!


✍🏼 నేటి కథ 

ఇది నిజమైతే ఎంత బాగుండు!

కోతులు సంతోషంతో గ్రామాల నుంచి అడవికి పరుగులు తీస్తున్నాయి. అప్పుడు వాటిని దారిలో ఒక అడవి దున్న ఆపి ‘ఎందుకు అలా పరుగెడుతున్నారు? ఏమైంది?’ అని అడిగింది.
‘ఏమీ లేదు. అడవిలో పండ్ల చెట్లు నిండుగా ఉన్నాయట. కుందేలు మామ చెప్పింది. ఇన్ని రోజులు అక్కడ అడవుల్లో చెట్లు లేక ఆహారం దొరకక మానవులుండే గ్రామాలకు వలస వచ్చాం. ఇక మన కష్టాలు తీరిపోయాయని కుందేలు మామ చెబితే ఎంతో సంతోషం కలిగింది. అందుకే ఈ పరుగు’ అని అన్నాయి. ఆ మాటలు విన్న అడవి దున్న ‘అయితే నేనూ వస్తాను పదండి’ అని అది కూడా పరుగు లంకించుకుంది.
కాసేపటికి వాటికి అడవి పందులు ఎదురై ‘ఎందుకు పరుగు తీస్తున్నారు? ఏమైంది?’ అని ప్రశ్నించింది. కోతులు జవాబు ఇస్తూ.. ‘మన అడవులు మళ్లీ దట్టంగా పెరిగాయట. పండ్ల చెట్లు విపరీతంగా పెరిగి అనేక రకాల పండ్లు కనిపించాయట’ అని అన్నాయి. వెంటనే అడవి పందులు అన్నీ కూడా అడవులకు పరుగులు తీశాయి.
అవి అలా వెళ్లిపోతుంటే ఎలుగుబంటి ఎదురై వాటిని ఆపి ‘ఏమిటా పరుగు.. మీరు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు’ అని ప్రశ్నించింది. అవి విషయం వివరించి చెప్పాయి. ‘ఎంత శుభవార్త చెప్పారు. నేనూ వస్తాను పదండి’ అని ఎలుగుబంటి అంది.
అవి అలా పరిగెడుతుంటే వాటికి ఏనుగులు ఎదురయ్యాయి. ‘ఎక్కడికి వెళుతున్నారు’ అని వాటిని ప్రశ్నించాయి. ‘ఓ ఏనుగు మామా! అడవులు చాలా పెరిగాయట. నువ్వు ఇంకా ఇక్కడ దేవాలయాల్లో, సర్కసుల్లో ఉండాల్సిన అవసరం లేదు. అడవుల్లో మీకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది పద! సింహం రాజుగా మనది మనమే చక్కగా పాలించుకుందాం’ అని అన్నాయి. అది విన్న ఏనుగులు కూడా వాటి వెనకే నెమ్మదిగా పరుగు తీశాయి.
ఇంతలో కుక్కలు, పశువులు కూడా గ్రామాల నుంచి పరుగు తీయడం ప్రారంభించాయి. అప్పుడు ఒక కోతి వెనకకు తిరిగి చూసి ‘అవునూ! మీరు ఎందుకు వస్తున్నారు? మీరు ఉండేది మనుషుల దగ్గరే కదా!’ అని అడిగింది.
అప్పుడు అవి ‘నీవన్నది నిజమే. మేము అడవిలో నివాసం ఉండటానికి పరుగు తీయడం లేదు. చూడటానికి వస్తున్నాం. ఎంతో సుందరంగా అడవులు పెరిగాయని మనుషులు కూడా అంటున్నారు. మేము చూస్తే తప్పేంటి?’ అని అన్నాయి. ‘సరే రండి. మానవులను మాత్రం వద్దని చెప్పండి. మా జంతువులను చూస్తే మళ్లీ వేటాడడం ప్రారంభిస్తారు’ అని అంది.
అప్పుడు అవి ‘అదేం లేదు. వారిలో చాలా మార్పు వచ్చింది. వారు రావడం లేదు. మేము చూసిన తర్వాత వారికి అడవి గొప్పతనాన్ని వివరిస్తాం. అయినా వారు మొక్కలు నాటితేనే కదా మీకు ఇప్పుడు అవి వృక్షాలుగా కనబడుతున్నాయి. అందరూ దుర్మార్గులు ఉండరు కదా!’ అని అన్నాయి.
‘ఎంతైనా మీరు మానవ పక్షపాతులు. సరే రండి’ అని అన్నాయి. వెంటనే అడవికి రాజైన సింహానికి ఈ సంగతి తెలిసి అది కూడా పరుగు పెట్టింది. తోవలో కనబడిన పెద్దపులి, చిరుతపులి, తోడేలు, జింకలకు కూడా ఈ సంగతి చెబుతూ.. ‘పదండి.. పదండి.. మన నివాసాలకు పోదాం. మనకు మంచి రోజులు వచ్చాయి’ అని అంది.
వెంటనే పక్కన ఉన్న నక్క ‘మహారాజా! మహారాజా! మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది.. ఏమి ఆ కలవరింత.. ఎవరికి మంచిరోజులు వచ్చాయో చెప్పండి’ అని అంది. అప్పుడే నిద్ర నుంచి మేల్కొన్న సింహం ‘అయ్యో ఇది కలా! ఎంత మంచి కల. ఇది నిజమైతే ఎంత బాగుండు’ అని నక్కతో అంది.

తెలుసు కుందాం

🟥మనిషి కోమా లో ఉండడం అంటే దేమిటి? అలా అయ్యేందుకు కారణం ఏమిటి? కోమా లో ఉన్నారంటే బ్రతికి ఉన్నట్లేనా?

🟩కోమా అంటే ఓ రకమైన దీర్ఘ నిద్ర లాంటిది . మనం నిద్రమత్తులో ఉన్నప్పుడు అప్రమత్తం (conscious) గా ఉండే పనులు చేయలేము . కేవలం స్వతంత్ర నాడీ వవ్యస్త (autonomousNervousSystem) అధీనం లో ఉండే శ్వాసక్రియ , హృదయ చలనం , రక్తప్రవాహం , జీర్ణక్రియ వంటి జీవ క్రియలు (PhysiologicalActivities) మాత్రమె జరుగురాయి . మనుషుల్ని చూసి గుర్తుపట్టడం , నడవడం , మాట్లాడడం , బాహ్యపరిస్తితులకు సనుగునం గా స్పందించడం వంటి కార్యకలాపాలను కొనసాగించలేరు .

తలపై గట్టి దెబ్బతగిలినా , కొన్ని రసాయన ద్రవ్యాల విషప్రభావం , ఆక్షిజన్ సరఫరా తగ్గడం , రక్తం లో ఉండే గ్లూకోజ్ ను కణాలకు అందించే 'ఇన్సులిన్' లోపం వల్ల కలిగే చెక్కెర వ్యాధి ముదరడం లేదా దాని వల్ల గ్లూకోజ్ స్థాయి తగ్గడం , మెదడులో ఏదైనా కణితి ఏర్పడడం , తదితర కారణాలు వల్ల మెదడు దేహాన్ని సజావుగా నడిపించలేని విపత్కర స్థితి ఏర్పడుతుంది .. కాని స్వతంత్ర నాడీ వ్యవస్థ బాగానే పనిచేయును .. అలాంటి సమయంలో మనిషి కోమాలోకి వెళ్ళును . కోమాలోకి ఎందువల్ల వేల్లారనే కారణము తెలుసుకొని చికిత్స చేస్తే వ్యక్తి మామూలు స్థితి కి వస్తాడు .
నిద్రపోవుచున్న వ్యక్తీ జీవించి ఉన్నట్లే ... కోమాలో ఉన్నా వ్యక్తీ బ్రతికి ఉన్నట్లే .

Thanks for reading Day 17: Students Summer Holidays Activities

No comments:

Post a Comment