Day 26: Students Summer Holidays Activities
Problem =సమస్య.
Complete =పూర్తి చేయు.
Room = గది.
Knew =తెలిసుకొనెను.
Since = అప్పటినుండి.
Ever = ఎప్పుడయిన, ఎప్పటికిని.
Piece = ముక్క.
Told = చెప్పెను.
Usually = సాధారణంగా.
Didn’t = కాదు.
Friends = స్నేహితులు.
Easy = సులభంగానున్న.
Heard = వినెను.
Order = ఆజ్ఞాపించు.
Red = ఎర్రని.
Class :3,4,5
26వ రోజు
Q) కోతి మరియు మొసలి కథ లోని కీలక పదాలను గుర్తించి ' సున్నా ' చుట్టండి. చదువుతూ 5 సార్లు మీ నోటు పుస్తకం లో రాయండి.
Q) Identify and circle the key words in the story 'The monkey and the crocodile'. Read and write the key words 5 times in your note book.
👇👇👇
💎నేటి ఆణిముత్యం
పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్
హిత మాచరింపవలయును
బ్రతుకున కొకవంక లేక పరగు గుమారీ!
తాత్పర్యం:
పుట్టినిల్లయినా, మెట్టినిల్లయినా పెద్దలమాటను కాదని పిల్లలు చేసే పనులేవీ శోభిల్లవు. పెద్దలుకూడా వారి మనసులు బాధ పెట్టకుండా
ప్రవర్తించాలి. అప్పుడే గృహాలు స్వర్గసీమలవుతాయి. భర్త, అత్త, మామలకు ఇష్టం లేని పనులను కోడలు ఎంత ప్రయోజనకరమైనా చేయకపోవడమే మంచిది. అలా ఎవరూ వేలెత్తి చూపించలేని నేర్పరితనంతో జీవించగలగాలి.
🤘నేటి సుభాషితం
అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.
👬 నేటి చిన్నారి గీతం
చిలకమ్మ పెండ్లి
చిలకమ్మ పెండ్లి అని - చెలికత్తెలందరూ
చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు - సందడి చేయగ
కాకుల మూకలు - బాకాలూదగ
కప్పలు బెక బెక - డప్పులు కొట్టగా
కొక్కొరోకోయని - కోడికూయగా
ఝుమ్మని తుమ్మెద - తంబుర మీటగ
కుహూ కుహూ యని - కోయిల పాడగా
పిల్ల తుమ్మెరలు - వేణువూదగా
నెమలి సొగసుగా - నాట్యం చేయగా
సాలీడిచ్చిన చావు కట్టుకొని
పెండ్లికుమారుడు బింకము చూపగా
మల్లీమాలతి - మాధవీ లతలు
పెండ్లి కుమారుని - పెండ్లి కూతురిని
దీవిస్తూ తమ పూవులు రాల్చగ
మైనా గోరింక మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత - చిరునవ్వు నవ్వుతూ
చిలకమ్మ మెడకట్టె - చింతాకుపుస్తై
🤠 నేటి సామెత
విన్నవన్నీ నమ్మొద్దు నమ్మినవన్నీ చెప్పొద్దు
ఒకవేళ నమ్మితే ఆ మాటలను మనసులోనే ఉంచుకోవాలి కానీ దాన్ని మరొకరి దగ్గర చెబితే కొన్ని సందర్భాల్లో దోషరహితులను దోషులుగా ప్రచారం చేసినట్లు అవుతుంది.
🗣నేటి జాతీయం
ఊకదంపుడు
ఊక అనగా వడ్లగింజపైనుండే పొట్టు. వడ్లను దంచితే పైపొట్టు పోయి బియ్యం బయడ పడతాయి. అందుకే వడ్లను దంచుతారు. కానీ ఊకను దంచితే ఏమి ఫలితముండడు. ఆ అర్థంలో అనవసరంగా వ్వర్థ ప్రసంగం చేసేవారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉటంకిస్తారు. వ్వర్థం అనే అర్థంలో.
Thanks for reading Day 26: Students Summer Holidays Activities
No comments:
Post a Comment