Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, May 30, 2023

Day 31: Students Summer Holidays Activities


    

Day 31: Students Summer Holidays Activities


Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:31 Activities

Class: 1,2

Q) వివిధ రకాల Balloons / trees / flowers Shapes draw చేసి colour వేయండి. 

తెలుగు:

Q) కింది అక్షరాలకు ఎత్వం, ఎత్వం దీర్ఘం చేర్చి రాయండి. చదవండి.

క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, క్ష

English

Q) Learn and write ' O ' words.

Onion          🧅

Orange        🍊

One              1️⃣

Owl              🦉

October 

Maths:

Q) Write the expanded form.



80 = 80 + 0

81 = 80 + 1

82 = 80 + 2

83 = .... + ......

84 = .... + ......

85 = .... + ......

86 = .... + ......

87 = .... + ......

88 = .... + ......

89 = .... + ......

90 = .... + ......

91 = .... + ......

92 = .... + ......

93 = .... + ......

94 = .... + ......

95 = .... + ......

96 = .... + ......

97 = .... + ......

98 = .... + ......

99 = .... + ......

100 = ...... + ...... + .......

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Person = వ్యక్తి.

Became = అయ్యెను.

Shown = చూపైంచెను.

Minutes = నిమిషము.

Strong = బలమైన.

Verb = క్రియాపదము.

Stars = నక్షత్రములు.

Front = ముందు.

Feel = తలంచు, అభిప్రాయపడు.

Fact = సత్యము.

Inches = అంగుళములు.

Street = వీధి.

Decided =నిశ్చయించెను.

Contain           = కలిగియండు.

Course = మార్గం,అభివృద్ధి.




Class :3,4,5
31 వ రోజు

Q) వేటగాడు - పావురాలు  కథను చదువుతూ మీ నోటు పుస్తకం లో రాయండి.

Q) Read and write the story 'Hunter - Doves' in your note book.
👇👇👇




💎నేటి ఆణిముత్యం

ఎన్నాళ్లు బ్రతుక బోదురు
కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!
తాత్పర్యం:

సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు.

🤘నేటి సుభాషితం
మంచి పుస్తకాలు దగ్గరుంటే మంచి మిత్రులు లేని లోపం కనిపించదు. గ్రంధపఠనాభిలాష గల వాడెక్కడున్నా సుఖంగా నివసించగలడు.

👬 నేటి చిన్నారి గీతం 
పాలబుగ్గ పాప

లాల ఉయ్యామమ్మ జోల ఉయ్యాల
ఊగేటి మా పాప తూగుటుయ్యాల
చిల్లి ఉయ్యాలమ్మ పొట్టి ఉయ్యాల
పట్టి ముద్దులపాప పసిడి ఉయ్యాల
పాల ఉయ్యాలమ్మ గాలి ఉయ్యాల
ఆకాశవీధిలో కెగురు ఉయాల
బాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల
పాలబుగ్గ పాప మేలి ఉయ్యాల


🤠 నేటి సామెత 

శల్య సారథ్యం లాగా

అతిగా నిరుత్సాహ పరిచే వారి గురించి దీనిని వాడుతారు. భారత యుద్ధంలో కర్ణుడికి సారది అయిన శల్యుడు  కర్ణుడిని అన్ని విధాల నిరుత్సాహ పరుస్తాడు.
✍🏼 నేటి కథ 
నిజమైన తెలివి

రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని వారికో పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు. తన ఇద్దరు కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి "ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువేదైనా కొనండి" అని వారితో చెప్పాడు.

పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్న పళంగా మార్కెట్టు వైపు వేగంగా వెళ్లి, మార్కెట్టులో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపడానికి ఆ గడ్డి సరిపోలేదు.

రెండవ కొడుకు తన తండ్రి అప్పజెప్పిన పని ఎంతో తెలివి తేటలతో పూర్తి చేయాలి అని అనుకుని దాన్ని గురించి బాగా ఆలోచించి, తండ్రి ఇచ్చిన డబ్బులో ఒక్క రూపాయితో క్రొవ్వొత్తిని కొని ఇంటికి వచ్చి, గదిలో క్రొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే ఆ క్రొవ్వొత్తి ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది.

రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్దకొడుకుకి చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు.

తెలుసు కుందాం

🟥వాహనాలకు నాలుగంకెలేల? Vehicles have Four digit Numberplate Why?

🟥వాహనాల రిజిస్ట్రేషన్‌ను నాలుగంకెలతో చేయడం ఒక ఆనవాయితీ (convention). అలాగే ఉండాలనడానికి విజ్ఞాన శాస్త్రపరమైన నియమం లేదు. గుర్తుపెట్టుకోడానికి సులువుగా ఉండడం కోసమే ఇలా చేస్తారు. అలా అయితే ఒక అంకె సరిపోతుంది కదా అనుకోకండి. ఎందుకంటే అలాంటప్పుడు ప్రతి 10 వాహనాల తర్వాత a,b,c,dలను ఆ అంకెలకు కలపాల్సి వస్తుంది. నాలుగు అంకెలతో నెంబర్లు ఉండడం వల్ల ప్రతి 10,000 వాహనాలకి ఓసారి అక్షరాలను జత చేసి ఇచ్చే వీలు ఉంటుంది. అయిదు లేదా ఆరు అంకెల సంఖ్యతో వాహనాలకు నెంబర్లు ఇస్తే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాటిని గుర్తు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక వాహనందారుడు ప్రమాదకరమైన వేగంతో వెళ్లేప్పుడు, ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించిపోతున్నప్పుడు దాన్ని ట్రాఫిక్‌ పోలీసులు చటుక్కున చూసి నెంబరును నోట్‌ చేసుకోవలసి వస్తుంది. అలాగే దుండగులు కిడ్నాప్‌ లాంటి నేరాలకు పాల్పడి వాహనాల్లో పారిపోయే సందర్భాల్లో ప్రత్యక్ష సాక్షులైన సామాన్యులు కూడా గుర్తు పెట్టుకోలేకపోతారు. ఈ కారణాల రీత్యా వాహనాల నెంబర్లకు నాలుగంకెలనే కేటాయించడం కొనసాగుతోంది.

Thanks for reading Day 31: Students Summer Holidays Activities

No comments:

Post a Comment