Day 7: Students Summer Holidays Activities
Students Summer Holidays Activities - - Summer vacation- summer activities
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:7 Activities
Class :1,2
7 వ రోజు
Q) వివిధ రకాల Balloons / trees / flowers Shapes draw చేసి colour వేయండి.
*Recap:
*తెలుగు:
Q) ప, ల, క, డ, వ, త, ఉ, బ, o అక్షరాలతో ఏర్పడే కింది పదాలను చదవండి. రాయండి.
కల
తల
తబల
కలం,
వంక
బంక
లంక
కలప
కలపడం
ఉతకడం
బతకడం
*English:
Q) Write the missing letters.
C - t 🐈
C - r 🚗
C - w 🐄
C - p 🧢
Cu - 🍵
*Maths:
Q) Write the before Number.
........ 4
......... 10
......... 25
...........39
...........71
*Class :3,4,5
7వ రోజు
🤘నేటి సుభాషితo
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో...దాని వలన లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.----నెహ్రూ
💎 నేటి ఆణిముత్యం 💎
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
భావం :
తనకు ఉన్న కోపమే తనకు హాని చేసే శత్రువు. తనలో ఉన్న శాంతగుణమే తనకు రక్షగా ఉంటుంది. ఇతరుల దుఃఖాన్ని పోగొట్టటానికి తాను చేసే పనే తనకు బంధువు, చుట్టం. తనకు ఉండే సంతృప్తే స్వర్గం అంటే సంతోషాన్ని కలిగించే చోటుతో సమానం. తనకు ఉన్న బాధే దుఃఖాలను, ఇబ్బందులను కలిగించే స్థానమని విజ్ఞులు చెబుతుంటారు.
ప్రతిపదార్థం :
తన కోపము + ఎ అంటే తనకి ఉన్న కోపమే. తన శత్రువు అంటే ఆ ప్రాణికి పగవాడు. తన శాంతము + ఎ అంటే తనలో ఉన్న నెమ్మదితనమనే లక్షణమే. తనకు రక్ష అంటే తనకు రక్షణనిస్తుంది.
దయ అంటే ఇతరుల కష్టాలను పోగొట్టటానికి ప్రయత్నం చేయటం. చుట్టంబు + ఔన్ అంటే బంధువు లేదా చుట్టం అవుతుంది. తన సంతోషము + ఎ అంటే తనకు ఉండే సంతృప్తే. స్వర్గము అంటే కష్టాలు లేకుండా కేవలం సుఖం మాత్రమే ఉండే దేవలోకం. తన దుఃఖము + ఎ అంటే తనకు ఉండే బాధే. నరకము అంటే కష్టాలకు నెలవైన నరకం (పాపాలు చేసినవారికి శిక్షపడే చోటు) తో సమానం. అండ్రు అంటే అంటారు లేదా చెబుతారు తథ్యము అంటే ఇది వాస్తవం.
కోపంతో ఉన్న మనిషి పశువుతో సమానం. ఏం చేస్తున్నదీ వారికే తెలియదు. ఆ కోపంలో విచక్షణ పోగొట్టుకుంటారు. కోపం తగ్గిన తరవాత తాము చేసిన తప్పు ఏంటో తెలుసుకుంటారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది. అందువల్ల కోపాన్ని అణచుకుంటే మంచిదని ఈ పద్యంలో కవి వివరిస్తున్నాడు.
🤠 నేటి సామెత
రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
రొలుకి ఒక పక్కనే వాయిస్తారు కాని మద్ధెలకు రెండు పక్కల వాయిస్తారు. ఒక బాధ ఉన్నవాడు తన బాధలను ..... రెండు బాధలున్న వాడితొ చెప్పుకున్నట్టు.
👬 నేటి చిన్నారి గీతం 👬
🌞ఎండలు🌞
ఎండలు కాసేదెందుకురా?
మబ్బులు పట్టేటందుకురా.
మబ్బులు పట్టేదెందుకురా?
వానలు కురిసేటందుకురా.
వానలు కురిసేదెందుకురా?
చెరువులు నిండే టందుకురా.
చెరువులు నిండేదెదుంకురా?
పంటలు పండే టందుకురా
పంటలు పండేదెందుకురా?
ప్రజలు బ్రతికే టందుకురా.
ప్రజలు బ్రతికే దెందుకురా?
దేవుని కొలిచే టందుకురా
దేవుని కొలిచే దెందుకురా?
ముక్తిని పొందే టందుకురా.
తాబేలు తెలివి కథ
**********************
ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్లాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగోవి వాయించడం ఒక తాబేలు కనిపించింది. అది చూసి "ఏమిటీ విడ్డూరం! తాబేలు పిల్లనగోవి వాయించటం ఏమిటీ!" అని వింతగా చూసాడు ఆ వేటగాడు. వెంటనే వింత నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లనగోవి పాడుతు మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి తెలియలేదు.
వేటగాడు ఆ తాబేలుని తన ఇంటిలో ఒక మూలన పెట్టి పిల్లనగోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు.
"ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లనగోవి వాయించి డబ్బు సంపాదించుకుంటాను" అని అన్నాడు వేటగాడు తన పెళ్ళాం, పిల్లలతో.
"చచ్చానురా" అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, "పిల్లలూ! ఇది తప్పించుకోకుండా కాపలా కాయండి. నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం కొనడానకి పోతున్నాను" అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు.
వేటగాడు అలా వెళ్లగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లంగోవి వాయించసాగింది. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పెట్టె దగ్గరకి వెళ్ళారు. " మీకు నా గానం నచ్చిందా?" "నన్ను ఈ పెట్టె నుండి బయటకు తీయండి. మనందరం కలిసి పాడుతూ ఆడదామా" అంది తాబేలు ఆ ఇద్దరి పిల్లలతో.
పిల్లలు తాబేలుని బయటకి తీశారు. తాబేలు మధురంగా పిల్లనగోవితో కమ్మగా పాటలు పాడుతుంటే, పిల్లలు ఆడసాగారు. ఇలా చాలా సేపు జరిగింది. చివరికి అలసిపోయి, చెమటతో తడిసిపోయారు ఆ పిల్లలు. "చెమటతో తడిసిపోయాం కదా, ఇప్పుడు మనం తానం చేద్దాం? అని అన్నది తాబేలు తన పథకాన్ని అమలు చేసుకొంటూ వెంటనే పిల్లలు ఒక బకెట్‌లో నీళ్లు తెచ్చారు. "ఇవి నాకు సరిపోవు. పదండి నదిలో తానం చేద్దామా" అన్నది తాబేలు. ఆ పిల్లలిద్దరూ తాబేలుని నది దగ్గరికి తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది.
నీతి : అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా దానినుంచి ఉపాయంతో బయటపడడం తెలివైన లక్షణం.
✅తెలుసు కుందాం
🟥ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళినపుడు కేవలం ఆక్షిజన్ మాత్రమే ఎందుకు రక్తం లో కలుస్తుంది ... నైట్రోజన్ తదితర వాయువులు ఎందుకు కలవవు ?
🟩గాలిలో ప్రధానం గా నైట్రోజన్ , ఆక్షిజన్ వాయువులు 4:1 నిష్పత్తి లో ఉన్నాయి ... నిజానికి గాలిలో 80% ఉండేది నైట్రోజన్ వాయువే . అది మన శ్వాసక్రియలో ఉపిరితిత్తుల్లోకి ప్రవేశించినా వచ్చిన దారినే తిరిగి బయటికి వస్తుంది ... అది రక్తం లో కలవదు . ఆక్షిజన్ గాలిలో 20% మాత్రమె ఉన్నా అది రక్తం లో కలుస్తుంది .
ఉపిరితిత్తులు స్పాంజి లు గా ఉంటాయి . గాలి మూలమూలలా వ్యాపిస్తుంది . . ఆ గాలి చిట్టచివరికి శ్వాస గుళిక (Alviolous) లో చేరుకుంటుంది . ఈ శ్వాసగులిక గోళాల్లో పలుచని చర్మంగల రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది , ఈ రక్తం లో "హీమోగ్లోబిన్ " ఉంటుంది , ఈ హీమోగ్లోబిన్ కు అయస్కాంత ధర్మం ఉన్నది . . . మనం పీల్చే గాలిలోని ఆక్షిజన్ కి కుడా అయస్కాంత లక్షణం ఉన్నది . అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి . ఈ లక్షణం వల్ల ఆక్షిజన్ రక్తం లోనికి ఆకర్షితమవుతుంది . అంతే గాని వ్యాపనం (diffusion) వల్ల మాత్రమే కాదు . వ్యాపనం పాత్ర చాలా పరిమితం . వ్యాపనం ద్వారానే అయితే నైట్రోజన్ కుడా రక్తం లో కలవాలి . జైత్రోజన్ కు అయస్కాంత ధర్మం లేదు ... అందువల్ల అది రక్తం లో కలవలేదు . అలాగని నైట్రోజన్ వాయువు శ్వాసక్రియ లో వృధా అని తెల్చేయకూడదు . గాలి పీడనానికి ప్రధాన అంశం ఈ నైట్రోజన్ . ఆ పీడనం వల్లే గాలి మన ఉపిరితిట్టుల్లో మారుమూల ప్రాంతాలకు కుడా చేరుకుంటుంది .
Thanks for reading Day 7: Students Summer Holidays Activities
No comments:
Post a Comment