Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 8, 2023

Day 9: Students Summer Holidays Activities


 

Day 9: Students Summer Holidays Activities


Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Classes :1,2
Day:9 Activities



Classes :3,4,5
9వ రోజు 
Q) ఒక రైతు మరియు బంగారు బాతు కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.

Q ) Wrire the Story ' The Farmer and The Golden Duck  ' in your own words and post in the group.






💎నేటి ఆణిముత్యం

జాతి, కులములంచు జనులెల్ల బద్దులై,
భావ పరమునందు బ్రాలుమాలి,
చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి
విశ్వదాభిరామ వినురవేమ!
 
భావం:-

జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై, వివేచనా ఙానము నశించి, చచ్చి పుడుతుంటారు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు. మనమందరూ సోదరభావముతో కులభేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి.

🤘నేటి సుభాషితం

శత్రువులను వదిలించుకోవాలంటే.. వాళ్ళను స్నేహితులుగా చేసుకోవడంకన్నా మంచి మార్గం లేదు.

🗣నేటి జాతీయం
ఇల్లు పీకి పందిరేయడం

అతి చిన్న విషయానికి నానా రభస చేయడము: అలాంటి వారినుద్దేసించి ఈ జాతీయాన్ని వాడుతారు. ఉదా: వాడు చిన్న విషయానికి ఇల్లు పీతకి పందిరి వేశాడు.

🤠 నేటి సామెత 

రాత రాళ్ళేరమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...?

జ్యోతిష్యం, జాతకాలు నమ్మి జీవితాన్ని గడిపేవాడు కష్టం వాటిల్లినప్పుడు, ప్రయత్నాలన్నీ విఫలమై ప్రయోజనం కలగనప్పుడు బ్రహ్మదేవుడు తనను సృష్టించినప్పుడే రాళ్ళేరుకుని బ్రతకమని రాసివుంచాడని తాను రాజుగా మారి రాజ్యాన్ని ఏలడం అందుకే వీలుపడడంలేదని అంటాడు.

👬 నేటి చిన్నారి గీతం
సమాజము

ఎంతో మంది పనివాళ్ళు     - ఎంతో మంచి పనివాళ్ళు
మడకను దున్నే మాదన్నా - కొడవలి పట్టిన కొండమ్మా
గుడ్డలు నేసే గురవయ్యా    - బట్టలు ఉతికే బాలమ్మ
!!ఎంతోమంది!!
కుండలు చేసే కుమరయ్యా  - కొలిమని ఊదే కోనయ్యా
చెప్పులు కుట్టే చెన్నయ్యా   - దుస్తులు కుట్టే మస్తాను
చదువు నేర్పే సాంబయ్యా   - యంత్రం నడిపే ఏసయ్యా
పనివాళ్ళంతా సమానమే    - అని చెప్పేదే సమాజము

✍🏼 నేటి కథ 

కోతి కొమ్మచ్చి.. చివరికి దానికి బుద్ధొచ్చి!

ఒక అడవిలో ఒక అల్లరి కోతి ఉండేది. అది ఇతర జంతువులను ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండేది. ఒకసారి ఏనుగును ‘ఏనుగు.. ఏనుగు.. ఎల్లన్నా! ఏనుగు రంగు నల్లన్నా’ అని పాట పాడుతూ ఏడిపించింది. ఏనుగుకు కోతి గుణం తెలుసు కాబట్టి నవ్వి ఊరుకుంది. మరోసారి ‘తాబేలు నీకన్నా నడకలో నయం’ అని గేలి చేసింది. తానేంటో.. తనకున్న శక్తి ఎంత గొప్పదో తెలిసిన ఏనుగు కోతి చేష్టలను పట్టించుకోలేదు.  
కొన్ని రోజుల తర్వాత కోతి నీళ్ల కోసం వెళ్లి ఒక ఊబిలో దిగబడిపోయింది. అది తనను కాపాడమని గట్టిగా కేకలు వేసింది. అక్కడ నుంచి నక్క, తోడేలు, పులి వెళ్లాయి. కానీ ఏ ఒక్కటీ దాని మొరను ఆలకించలేదు. తనకు చావు తప్పదని అనుకున్న కోతి వెక్కివెక్కి ఏడ్చింది.
అప్పుడే అక్కడకు వచ్చిన ఏనుగు అది గమనించి దాని తొండంతో కోతిని కాపాడింది. గతంలో తాను ఏనుగును ఆట పట్టించినందుకు సిగ్గుపడి క్షమాపణలు చెప్పింది. అప్పుడు ఏనుగు ‘ఇకనైనా మంచి పనులు చేసి ఇతరుల మెప్పును పొందు’ అని అంది.
అయినా కోతి తన అల్లరి మానలేదు. అది ఒక గాడిదను చూసి ‘తెలివిలేని దద్దమ్మలు గాడిదలేరా! జీవితమంతా మూటలు మోస్తూ బతికేస్తాయి’ అని పాటలా పాడింది. గాడిద ఇవేమీ పట్టించుకోలేదు. పాడీ.. పాడీ.. చివరకు విసుగొచ్చి కోతే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఓ సారి కోతి పొరపాటున ముళ్ల కంపల్లో చిక్కుకుంది. అప్పుడు దాన్ని గాడిద కాపాడింది. గాడిదను ఒకప్పుడు తిట్టినందుకు కోతి ఎంతగానో బాధపడింది. దాన్ని క్షమాపణలు వేడుకుంది. అప్పుడు గాడిద ‘నువ్వు మంచి పనులు చేసి ఇతరుల మెప్పును పొందు’ అంది.
ఈ రెండు సంఘటనలతో కోతిలో కాస్త మార్పు వచ్చింది. ఇక నుంచి అది ఎవరి జోలికీ వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ఒకసారి ఒక ఒంటె పండ్ల చెట్టు దగ్గర నుంచి వెళుతుంటే కోతి దాన్ని పిలిచింది. తనను దాని మీద ఎక్కించుకొమ్మని అడిగింది. ఒంటె అస్సలు ఒప్పుకోలేదు. కోతికి మళ్లీ కోపం వచ్చి తాను మారిపోవాలి అనుకున్న సంగతిని కూడా మరిచిపోయింది. ‘ఓ పిచ్చి ఒంటె.. నీ జీవితమంతా తంటాలే..’ అని పాటపాడుతూ దుర్భాషలాడింది. ఒంటె ఏమీ మాట్లాడలేదు.
కొన్ని రోజులకు కోతి ఒక వాగు దాటుతూ నీటిప్రవాహానికి కొట్టుకు పోసాగింది. అది గట్టిగా తనను కాపాడమని కేకలు వేసింది. అప్పుడు అక్కడే ఉన్న ఒంటె తనపై కూర్చోబెట్టుకుని ఆ వాగు నుంచి దాన్ని ఒడ్డుకు చేర్చింది. అప్పుడు కోతి ‘నేను కాలు నొప్పి వల్ల చెట్టు ఎక్కలేకపోయాను. అందుకే నీ పైన కూర్చుండి ఆ చెట్టు పండ్లను తెంపుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు ఒప్పుకోక పోయేసరికి నాకు కోపం వచ్చింది’ అని అంది.
అప్పుడు ఒంటె నవ్వి ‘నేను అక్కడ తేనెతుట్టె ఉందని గమనించే నిన్ను నాపైన కూర్చుండ పెట్టుకోలేదు. అవి ఒకవేళ కుడితే నువ్వు, నేను ఇద్దరం పరుగు పెట్టాల్సి వచ్చేది. అందుకే అప్పుడు నేను నువ్వు అడిగిన సాయం చేయలేకపోయా’ అంది. ఆ మాటలు విని కోతి సిగ్గుపడింది. ఒంటెకు క్షమాపణలు చెప్పింది.
‘ఇకనైనా నువ్వు పూర్తిగా మారు. మంచి పనులు చేసి ఇతరుల మెప్పును పొందుతూ ఉండు’ అంది. కోతి ఇకపై కచ్చితంగా మారాలని నిర్ణయించుకుంది. తాను తిన్న ఫలాల నుంచి సేకరించిన విత్తనాలను జాగ్రత్తగా అడవంతా నాటడం ప్రారంభించింది. ఇది చూసి అడవిలోని జంతువులన్నీ కోతిని మెచ్చుకున్నాయి. కొన్ని సంవత్సరాలకు అవి పెద్ద పెద్ద చెట్లుగా మారాయి. దాంతో ఆ అడవికి కోతివనం అని పేరు కూడా పెట్టాయి.


తెలుసు కుందాం

🟥పదార్ధాలను మైక్రోవేవ్ ఓవెన్ లో వండడానికి , మామూలు పొయ్యి మీద వండడానికి తేడా ఏమిటి ?

ఒక్క ముక్కలో చెప్పాలంటే మామూలు పొయ్యి లో ఆహారపదార్ధాలు బయటి నుంచి లోపలికి ఉడికితే , మైక్రోవేవ్ ఓవెన్ లో అవి లోపలి నుంచి బయటకి ఉడుకుతాయి . ఇది అర్ధం కావాలంటే కాంతి గురించి తెలుసుకోవాలి . కాంతి ఓ విద్యుదయస్కాంత(ElectroMagnatic) తత్త్వం గల శక్తి స్వరూపము . ఇది తరంగాలు గాను , ఫోటాన్లు అనే కనాలుగాను ప్రయాణిస్తుంది . మనం కంటి తో చూడగల కాంతితరంగాలను దృశ్య కాంతి (VisibleLight) అంటాము . మనం చూడగల దృశ్యకాంతి కన్నా తక్కువ శక్తిగల కాంతి తరంగాలు కొన్ని ఉన్నాయి . వాటిలో ఒకటే ' మైక్రోవేవ్ ' తరంగాలు ... ఇవి ఒక విధంగా ప్రత్యేకమైన పౌనః పుణ్యం గల రేడియో తరంగాలే . మైక్రోవేవ్ ఓవెన్ లో ఆహారం ను ఉడికిన్చేవి ఇవే .

మనం వంట వండుకోవడం అంతే ఏమిటో తెలుసా ? ... ఆహారపదార్ధాల లోని అను బంధాలను చేదించడమే(BondCleavage) . దీన్నే ఉడకడం అంటాము . ఓవెన్ లో ఆహారపదాదాలను పెట్టి ఆన్ చేస్తే మైక్రోవేవ్ తరంగాల వల్ల ఆహారపదార్దాల్లోని అణువులు ఉత్తేజం పొందుతాయి . నీటి అణువులు గిరగిరా తిరిగి అనుబంధాల్ని చేదిస్తాయి . తద్వారా ఆహారము త్వరగా ఉడుకుతుంది . ఆహారపు అణువులు , నీరు వంటి పదార్దాలే micro ఓవన్ తరంగాల శక్తిని గ్రహించగలవు . పింగాణి , గాజు వంటివి ఆ తరంగాలను అడ్డుకోలేవు .. కాబట్టి ఈ తరంగాల శక్తి నేరుగా ఆహారపదార్ధాల అనుస్తాయి లో పనిచేసి వంట త్వరగా పూర్తీ అవుతుంది . మామూలు పొయ్యిమీద వంట చేసేతపుడు ఆహారపదార్ధాలను ఉడికించడానికి ఉష్ణ శక్తి పనిచేస్తుంది . మంట నుండి పుట్టే ఉష్ణ శక్తి మొదట పాత్రను వేడేక్కిస్తుంది .. చుట్టుప్రక్కల గాలి కుడా వేడెక్కుతుంది .. అంతే వేడి ఆహారపదార్ధాల అణువుల వరకు చేరే లోపల చాలా వరకు వృధా అవుతుంది అన్నమాట. అందువల్ల చాలచేపు ఉడికిన్చితే తప్ప ఆహారము ఉడకడు .

Thanks for reading Day 9: Students Summer Holidays Activities

No comments:

Post a Comment