Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 10, 2023

SSC CHSL 2022: SSC - Combined Higher Secondary Level Examination 2023


 

SSC CHSL 2022: SSC - Combined Higher Secondary Level Examination 2023

SSC CHSL 2023: ఎస్‌ఎస్‌సీ - కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2023 

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2023 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్‌ అర్హత ఉన్నవారెవరైనా జూన్‌ 8లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రకటన వివరాలు…

* ఎస్‌ఎస్‌సీ - కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌- 2023

ఖాళీలు: 1,600

1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ 

2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో)

3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ)

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.

వయసు: 01-08-2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02-08-1996 నుంచి 01-08-2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

జీతభత్యాలు:

* ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200.

* డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500-81,100.

* డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎకు రూ.29,200-92,300.

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

ప్రశ్నపత్రం: టైర్‌-1 పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. టైర్‌-2 పరీక్షకు 405 మార్కులు కేటాయించారు. ఇందులో మ్యాథమేటికల్‌ ఎబిలిటీస్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ మాడ్యుల్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 09-05-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 08-06-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-06-2023.

ఆఫ్‌లైన్‌లో చలానా జనరేషన్‌కు చివరి తేదీ: 11-06-2023.

చలానా ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: 12-06-2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 14-06-2023 నుంచి 15-06-2023 వరకు.

టైర్‌-1(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: ఆగస్టులో నిర్వహిస్తారు 

టైర్‌-2 (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

Website Here

Notification Here

Thanks for reading SSC CHSL 2022: SSC - Combined Higher Secondary Level Examination 2023

No comments:

Post a Comment