Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, May 4, 2023

Students Summer Holidays Activities


 Students Summer Holidays Activities


Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:5 Activities







Class: 1,2

To develop drawing skills:

Q) Colour the symbol of a rupee coin

Recap:

తెలుగు:

Q) కింది ఖాళీలలో సరియైన అక్షరాన్ని రాయండి.

ప - వ 
ఉ డ - 
ఉ - వ 
క డ - 
ప ల - 

English:

Q) Write the missing letters.

B - t
B - l l
B - g 
B - y
B - s

Maths:

Q) Write 1 to 20 Number Names.

Class:3,4,5 English

This is my bag🎒
ఇది నా సంచి.
This is my pen🖋️
ఇది నా కలము.
This is my pencil✏️
ఇది నా పెన్సిల్.
This is my book📕
ఇది నా పుస్తకం.
This is my gown👗
ఇది నా గౌను.
This is my mobile📱
 ఇది నా మొబైల్.
This is my watch⌚
ఇది నా చేతి గడియారం.
This is my school 🏫
ఇది నా పాఠశాల.
This is my chair🪑
ఇది నా కుర్చి.
This is my doll 🧸
ఇది నా బొమ్మ.
This is my ball🏀
ఇది నా బంతి.
This is my cycle🚲
ఇది నా సైకిల్.


🎯DAY-5🎯

WE LOVE READING..

The Loyal Mongoose

Once upon a time in a village, there lived a Brahmin with his wife. One day, they were blessed with a son. The Brahmin thought to have a pet for the child so as to protect him as well as to get a companion for him. He went in search of the pet and found a mongoose. He brought him to his house.

At first, the Brahmin’s wife was reluctant to have a mongoose as a pet. But later she agreed to it. The mongoose and the child became close friends. Both, the Brahmin and his wife, started loving the mongoose like their own child. But the Brahmin’s wife was always a little sceptical about the mongoose being near the child.

On a particular day, the Brahmin’s wife had to go to the market to buy vegetables. She told the Brahmin to take care of the child. The child was sleeping peacefully in the cradle. The Brahmin then left for begging alms. He thought that the mongoose would look after the child.

A few hours later, the Brahmin’s wife returned and saw the mongoose at the door. His mouth was completely blood-stained. She inferred that the mongoose had killed the child. At once, she threw the basket of vegetables on the mongoose.

She ran towards the room in search of her child and to her surprise, saw the child still sleeping quietly in the cradle. But on the floor was a dead snake which was bitten into pieces.

Then she understood that to save the child, the mongoose attacked and killed the snake. Realizing her terrible mistake, she rushed back to the mongoose only to find him dead. The Brahmin’s wife cried aloud as she had killed the loyal mongoose.

🔮Moral of the Story:

Don’t perform hasty actions. Think before you act.

💎నేటి ఆణిముత్యం

మొదలు జూచిన కడు  గొప్ప , పిదప కురుచ,
ఆది కొంచెము , తర్వాత అధికమగుచు
తనరు , దిన పూర్వ పరభాగ జనితమైన
 చాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి.

తా :  దుర్మార్గుల తోడి స్నేహం ఉదయం  పూట నీడలాగా ముందు పెద్దగా ఉండి క్రమక్రమంగా తగ్గిపోతుంది.
సజ్జనులతోడి మైత్రి సాయంకాలపు నీడలాగా మొదట చిన్నగా ఉండి క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
 అందువల్ల సరియైన స్నేహితులను ఎంచుకోవాలి బుద్ధిమంతుడు.

🤘నేటి సుభాషితం

ఘనకార్యాలను సాధించడానికే భగవంతుడు మనల్ని ఎన్నుకొన్నాడని విశ్వసించి, ఉత్సాహంగా ఉండండి. మనం వాటిని సాధించే తీరుతాం.
                 
👬 నేటి చిన్నారి గీతం 
పాపాయి

పాపాయి కన్నుల్లు కలువరేకుల్లు
పాపాయి జుంపాలు పట్టుకుచ్చుల్లు
పాపాయి దంతాలు మంచిముత్యాలు
పాపాయి చేతులు పొట్ట్లకాయల్లు
పాపాయి పిక్కలు మొక్కజొన్న పొత్తులు
పాపాయి చెక్కులు పసివెన్నముద్దల్లు
పాపాయి వన్నెలు పసినిమ్మపండుల్లు
పాపాయి పలుకులు పంచదార చిలకల్లు
పాపాయి చిన్నెలు బాలకృష్ణుని వన్నెల్లు

🤠 నేటి సామెత 🌸

రాగంలేని భోగం, త్యాగం లేని మనస్సు

ఎంతగా భోగాలను అనుభవిస్తున్నా బంధుమిత్రుల అనురాగం లేకపోతే ఆనందమే ఉండదు.ఎలాంటి త్యాగమూ లేకుండా జీవితం గడుస్తూ ఉంటే మనస్సుకు ఆనందం ఉండదని ఈసామెత అర్థం.

✍🏼 నేటి కథ 

పిల్ల చీమ సందేహం

ఒక పుట్టలో పుట్టిన బుజ్జి చీమ తొలిసారిగా బయట ప్రపంచాన్ని చూడడానికి వచ్చింది. చెట్లు, చేమలు, పక్షులు, జంతువులను చూడగానే ఆ పిల్ల చీమకు ఆశ్చర్యం వేసింది. వాటి ముందు తాను చాలా చిన్నగా ఉన్నానని బాధ పడింది. కాసేపటికి పే.. ద్ద ఏనుగు దానికి ఎదురైంది. అదైతే ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నట్లే ఉంది. దాన్ని చూడగానే చీమ కళ్లు చెదిరాయి. ఏనుగు తన బలమైన తొండంతో చెట్ల కొమ్మలను విరిచి తినడం విచిత్రంగా తోచింది.
అలా చూస్తుండగానే.. ఓ కోతి ఒక చెట్టు నుంచి మరో చెట్టు మీదకు అమాంతం దూకింది. దానికి దొరికిన కాయలు, పండ్లు ఎంచక్కా పొట్ట నిండా తింది. ఆ పక్కనే ఓ పే..ద్ద కొండచిలువ ఏదో జీవిని నోటకరుచుకుని మింగేయడానికి ప్రయత్నిస్తోంది.

పిల్ల చీమ సందేహం


వాటన్నింటిని చూసిన తర్వాత చీమకు తన మీద తనకు మరింత అసహ్యం వేసింది. ‘అబ్బా.. జీవితమంటే వాటిది. నాదీ ఒక బతుకేనా?’ అనుకొని బాధ పడింది. తనకు వాటిలా బతికే అవకాశం లేకుండా చేసిన భగవంతుడి మీద కోపం కూడా వచ్చింది.
బయటకు వెళ్లి చాలా సమయమైనా ఇంకా తన దగ్గరకు రాని పిల్ల చీమను వెతుక్కుంటూ తల్లి చీమ అక్కడకు చేరింది. తన తల్లిని చూసిన పిల్ల చీమ ‘అమ్మా.. అమ్మా..’ అంటూ పిలుస్తూ అక్కున చేరింది. ‘అమ్మా.. ఆ జీవులు చూడు ఎంత పెద్దవో.. కావాల్సిన ఆహారం చక్కగా తింటున్నాయి. ఛీ.. ఏమిటో.. ఈ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు’ అని బాధపడింది. దానికి తల్లి చీమ.. ‘ఇప్పుడేమైందని అంతలా బాధపడుతున్నావ్‌’ అంది. ‘అలా అంటావేంటి అమ్మ. మనదీ ఒక బతుకేనా.. గట్టిగా గాలి వీస్తే చెల్లాచెదురయ్యే జీవితాలు మనవి. బతికున్నన్ని రోజులు బరువులెత్తుతూ చాకిరీ చేయాలి మనం. ఆ ఏనుగులా మనం ఘీంకరించగలమా? సింహంలా గర్జించగలమా? ఆ పక్షుల్లా కిలకిలరావాలు పలికించగలమా? ఆ చిరుతపులిలా మెరుపువేగంతో పరుగెత్తగలమా? అదిగో ఆ లేడిలా చెంగుచెంగున గెంతగలమా?.. ఇవేమీ చేయలేం మనం. మరి మనది జీవితం ఎలా అవుతుంది’ అని పిల్లచీమ ఏడ్చింది.
పిల్ల చీమను ఎలా ఓదార్చాలో.. తనను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తల్లి చీమకు అర్థం కావడం లేదు. ఎంత చెప్పినా పిల్ల చీమ వినడం లేదు. ఇంతలోనే కొందరు తుపాకులు, విల్లులు, తాళ్లు, కర్రలు, ఇనుప గొలుసులతో దాడి చేస్తూ అడవి మీద పడ్డారు. దొరికిన జంతువును దొరికినట్లు బంధించారు. వాటన్నింటినీ లారీల్లో ఎక్కించుకుని చక్కా పోయారు.
‘అయ్యయ్యో.. ఎందుకమ్మా.. ఆ సింహాన్ని, పులిని, జింకల్ని, పక్షుల్ని, కొండచిలువల్ని, నక్కల్ని.. ఇలా కనిపించిన ప్రతి జీవినీ బంధించుకుని తీసుకొనిపోయారు. ఇంతకీ వాటిని ఏం చేస్తారమ్మా’ అని భయపడుతూ పిల్ల చీమ తల్లిని అడిగింది. ‘వాళ్లు స్మగ్లర్లు అమ్మా.. ఇప్పుడు బంధించిన జీవుల్లో కొన్నింటిని వాటి గోర్లు, చర్మం కోసం చంపేస్తారు. మరికొన్నింటిని సర్కస్‌ వాళ్లకు అమ్మేస్తారు. ఆ సర్కస్‌వాళ్లేమో వాటితో ఆటలాడించి సొమ్ము ్ఞచేసుకుంటారు. అవి చచ్చిపోయేంత వరకూ పాపం బందీగా బతకాల్సిందే’ అని చెప్పింది తల్లి చీమ.
‘అమ్మా.. మరి వాళ్లు మనల్ని ఎందుకు బంధించలేదు’ అని పిల్ల చీమ అనుమానం వ్యక్తం చేసింది. ‘మనతో వాళ్లకేం పని ఉండదు. అసలు వాళ్ల దృష్టి మన మీద పడితేగా.. కావాలని చూస్తే తప్ప మనం మనుషులకు కనిపించంగా.. అదే మనకు రక్షణ’ అంది తల్లిచీమ. ‘అయ్యో.. దేవుడా.. నిన్ను అనవసరంగా తిట్టాను. నన్ను చీమలా పుట్టించి నాకు ఎంతో మేలు చేశావు. నేను మరో జీవిలా పుట్టి ఉంటే.. ఇప్పుడు వేటగాళ్ల చేతులకు చిక్కేదాన్ని. ఎన్ని జన్మలైనా సరే నన్ను చీమగానే పుట్టించు’ అని పిల్ల చీమ వేడుకుంది.
‘ఈ సృష్టిలో ప్రతి జీవీ గొప్పదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఎవరికి ఉండే సంతోషాలు, కష్టాలు వాళ్లకుంటాయి. మనకుండే ఆపదలూ మనకు ఉంటాయి. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. దేని గురించీ అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు’ అని తల్లి చీమ పిల్ల చీమకు హితబోధ చేసింది. అప్పటి నుంచి పిల్ల చీమ ఉన్న దాంట్లోనే ఆనందంగా బతకడం అలవాటు చేసుకుంది.

✅తెలుసు కుందాం
🟥కాంతి - తరంగామా ? కణమా?, Light-is a cell or a ray?

కాంతి (LightRay) - తరంగమ?కణమా ? అంటే చెప్పడము కష్టమే ! ఒక్కొక్క సారి ప్రశ్న కు ఎదురు ప్రశ్నే జవాబునిస్తుంది . ఉదాహరణకి నాణేనికున్నది బొమ్మా లేదా బొరుసా? అంటే ఏం చెబుతాం ?. కాంతికి కుడా నాణేనికిలాగే కణ(Corpuscular) స్వభావము , తరంగ (Wave)స్వభావము సంయుక్తం గా అవిభాజ్యం గా ఉంటాయి . ఎలాగైతే నేల మీద పడేసిన నాణెపు రెండు పక్కలు (బొమ్మ , బొరుసు) ఒకే సారి ఎలా చూడ లేమో ... ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్ని , కణ స్వభావాన్ని ఏకకాలం లో పరిశీలించాలేము .

కాంతి వక్రీభవనం(Refraction) , వివర్తనం (Disfraction) , వ్యతికరణం (Interference), ద్రువనం (Polarisation) అనే ధర్మాలను కలిగి ఉంటుంది . కాంతి కున్న తరంగ స్వభావానికి ఈ ద్రుగ్విషయాలు కారణము . కాంతి విద్యుత్ఫలితము (PhotoElectricEffect), కాంఫ్తాన్ ఫలితము , కాంతి రసాయనిక చర్యలు (PhotoChemical phinomena) , కృష్ణ వస్తు వికిరణం (BlackBodyRadiation) ఉద్గార వర్ణ పటాలు (EmissionSpectra) వంటి ప్రయోగ ఫలితాలు , పరిశీలనలు , కాంతి కున్న కనస్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకం గా రెండు లక్షణాలు ఏక సమయం లో ఉండడం వల్ల కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం (WaveParticleDuality) ఉందంటారు.

Thanks for reading Students Summer Holidays Activities

No comments:

Post a Comment