Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 5, 2023

38,000 teachers and staff to be recruited for 740 Eklavya Model Residential Schools


 Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌!!

దిల్లీ: దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో భారీ సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో దేశంలో వచ్చే మూడేళ్లలో 740 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 3.5లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ఈ భారీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా 38వేలకు పైగా కొలువుల జాతరకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రిన్సిపల్‌ పోస్టులు మొదలుకొని బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఏయే పోస్టులు ఎన్నంటే..?

ప్రిన్సిపల్‌ 740; వైస్‌ ప్రిన్సిపల్‌ 740; పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT) 8880, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT) 8840; ఆర్ట్‌ టీచర్‌ 740, మ్యూజిక్‌ టీచర్‌ 740; ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(PET) 1480; లైబ్రేరియన్‌ 740; కౌన్సెలర్‌ 740; స్టాఫ్‌ నర్సు 740; హాస్టల్‌ వార్డెన్‌ 1480; అకౌంటెంట్‌ 740; సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 740; జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 1480; క్యాటరింగ్ అసిస్టెంట్‌ 740; డ్రైవర్‌ 740, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ 740; ల్యాబ్‌ అటెండెంట్‌ 740; గార్డెనర్‌ 740; కుక్‌ 470, మెస్‌ హెల్పర్‌ 1480; చౌకీదార్‌ 1480; స్వీపర్‌ 2220 చొప్పున ఉన్నాయి.

డైరెక్టు ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టుల భర్తీకి నిబంధనలేంటి? విద్యార్హతలు, వేతనం ఎంత? వయో పరిమితి, అనుభవం,  ప్రొబేషన్‌ పీరియడ్‌, ఏ ప్రాతిపదికన రిక్రూట్‌ చేస్తారు? తదితర పూర్తి వివరాలను ఈ కింది నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Thanks for reading 38,000 teachers and staff to be recruited for 740 Eklavya Model Residential Schools

No comments:

Post a Comment