Amazon sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలొచ్చాయ్.. ఈ కార్డులపై 10% డిస్కౌంట్
Amazon Prime Day 2023 sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు వెల్లడయ్యాయి. జులై 15, 16 తేదీల్లో ఈ సేల్ జరగనుంది.
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఆఫర్ల పండగకు తెరలేపింది. జులై 15, 16 తేదీల్లో రెండ్రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day 2023) నిర్వహించనుంది. ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభిస్తాయి.
జులై 15వ తేదీ 12 గంటల నుంచి జులై 16వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ పే - ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కొత్తగా ఈ కార్డు తీసుకునే వారికి రూ.2500 విలువైన ప్రయోజనాలను అందిస్తామని అమెజాన్ చెబుతోంది.
అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో భాగంగా సుమారు 400 కంపెనీలకు చెందిన ఉత్పత్తులపై డిస్కౌంట్లు లభిస్తాయని అమెజాన్ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్లు, బ్లూటూత్ హెడ్‌సెట్లు, ల్యాప్‌ట్యాప్‌లు, కెమెరాలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లతో పాటు ట్రావెల్ టికెట్లపైనా డిస్కౌంట్లు అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని ఆఫర్లను అమెజాన్ రివీల్ చేయగా.. మరికొన్ని ఆఫర్ల వివరాలను వెల్లడించలేదు. తేదీలు దగ్గర పడ్డాక ఆయా వివరాలు తెలుస్తాయి. కొత్తగా లాంచ్ అయిన పలు మొబైళ్లు ఈ సేల్‌లో డిస్కౌంట్‌పై లభించనున్నాయి.
Thanks for reading Amazon Prime Day 2023 sale
No comments:
Post a Comment