Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, June 1, 2023

Day 33: Students Summer Holidays Activities


    

Day 33: Students Summer Holidays Activities


Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:33 Activities

Class: 1,2
33 వ రోజు 

To develop plantation habits:

Q) Collect the waste bottles / coconut shels and prepare a tree pot, fill with soil, sow a seed/ plant of your choice . Write ' my tree - my friend ' on the paper and paste on it and show that your Neighbours.

తెలుగు:

Q) కింది కథను చదువుతూ రాయండి.

కుందేలు, తాబేలు పరుగు పందెం కాసాయి. కుందేలు పరుగు తీసింది.  తాబేలు నడవ సాగింది. కుందేలు కునుకు తీసింది. తాబేలు ఆగకుండా నడిచింది. తాబేలు పందెం గెలిచింది.

English:

Q) Learn and write ' Q ' words.

Queen

Quill

Quiz

Quiet

Queue

Maths:

Q) Do the following Additions.

              3   8  6
         +   4   3  7
        ...................
        ...................

              5   7   8
         +   3   9   5
        ...................
        ...................

              7   0   6
         +   4   5   8
        ...................
        ...................

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Island = దీవి.

Week = వారము.

Less = తక్కువైన.

Machine = యంత్రము.

Base = పునాది,నీచమైన,ఆధారపడు.

Ago = పూర్వము.

Stood = నిలబడెను.

Plane = తలము,విమానము.

System =వ్యవస్థ.

Behind = వెనుక.

Ran = పరుగెత్తెను.

Round = చట్టూ.

Boat = పడవ.

Game = ఆట.

Force =బలము ఉపయోగించు.












Class :3,4,5
33 వ రోజు

Q) వేటగాడు - పావురాలు కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.

Q ) Wrire the Story 'Hunter - Doves' in your own words in your note book and post in the group.
👇👇👇






💎నేటి ఆణిముత్యం

తనయందు నఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు
        పెద్దల బొడగన్న భృత్యునికైవడి  చేరి నమస్కృతుల్  సేయువాడు
        కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన  మాతృభావన సేసి మరలువాడు 
        తల్లిదండ్రులభంగి ధర్మవత్సలతను దీనులగావ జింతించువాడు 

భావము: తనని తాను ఎలా చూస్తాడో ,తన గురించి తాను ఎలా భావన చేస్తాడో  సమస్తప్రాణులను కూడా అదే భావన తో చూసే లక్షణమును  (సమహితత్వమును)  కలిగియున్నవాడు ,పెద్దలు కనబడగానే భృత్యుని (సేవకుని) వలె నమస్కారము చేసే వాడు,తన కంటికి ఇతర స్త్రీలు కనబడగానే మాతృభావన చేసి పక్కకు వెళ్ళేవాడు .ఇక్కడ పోతన గారు వాడిన పదములను గమనించాలి , ఆయన ప్రహ్లాదుడు అన్యస్త్రీలను చూస్తే అని అనలేదు, అన్యస్త్రీలు ప్రహ్లాదుని కంటి కి (కంటి చూపుకి) అడ్డమైతే అన్నారు అంటే తనగా తాను అటువంటి తావులకు పోడు ఒక్కోసారి ఏదైన అవసరము ఉండి వారే ఎదురైతే  మాతృభావన  చేసి మరలిపోయేవాడు .దీనులను తల్లితండ్రుల వలె కంటికి రెప్పలా ,వాత్సల్యము తో చూచెడి వాడు. తనతో సమవయస్కులైన వారిని స్నేహితులను సోదరులవలే చూచువాడు .గురువులను ప్రత్యక్ష దైవముగా జూచెడివాడు ,పరిహాసమునకైనా కూడా అసత్యమును పలుకని వాడు.
భాగవతం లో ప్రహ్లాదుని గుణగణముల గురించి ఈ విధముగా చెప్పబడినది.

👬 నేటి చిన్నారి గీతం

   ఏం కావాలి

ఆట కావాలా.... పాట కావాలా
పాట కావాలి
పాట కావాలా... పండు కావాలా 
పండు కావాలి
పండు కావాలా...కారా కావాలా 
కారా కావాలి
కారా కావాలా...కోవా కావాలా 
కోవా కావాలి
గోవా కావాలా...కథలు కావాలా 
కథలు కావాలి 
నాకు కమ్మనైన కథలు కావాలి 


🤘నేటి సుభాషితం

మనలోనుంచి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగులు చూపించేదిగా ఉండాలి. కానీ చీకట్లోకి నెట్టివేసేదిగా ఉండకూడదు.

🤠 నేటి సామెత

సింగినాదం జీలకర్ర

ఒకప్పుడు జీలకర్ర వర్తకులు తమ రాకకు గుర్తుగా శ్రుంగనాదం (కొమ్ము బూర) ఊదేవారు.పాతకాలములో జీలకర్ర వర్తకులు పడవలో వేసుకుని ఆ పడవలో కాలువలో వెళుతూ, ఏదైనా ఊరు వచ్చినప్పుడు బూర ఊదేవారట. అది విని కావలిసినవారు జీలకర్ర పడవ వచ్చిందని తెలుసుకొని కొనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళు. దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు కూడా బూర ఊది, వచ్చిన జనాల్ని దోచుకునేవారు.ఆ విధంగా శ్రుంగనాదం-జీలకర్ర ఒకటయ్యాయి. కాలక్రమాన, శ్రుంగనాదం-జీలకర్ర కాస్తా సింగినాదం జీలకర్రగా వాడుకలో మారిపొయింది.ఇలా నిజమో అబద్ధమో తెలియని మాటలను సింగినాదం జీలకర్ర అని కొట్టి పారవేస్తుంటారు.

🗣నేటి జాతీయం
మిట్ట పెత్తనం!

‘ఊరకే అరవడం తప్ప పనేమీ చేయడు... అంతా మిట్ట పెత్తనం’... ‘నువ్వు చేయాల్సింది మిట్ట పెత్తనం కాదు... నలుగురితో కలిసి కష్టించడం’... ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం. పని చేయకుండా హడావుడి చేసేవారి విషయంలో ఉపయోగించే మాట ఇది. పూర్వం పొలాల్లో మిట్ట (ఎత్తయిన ప్రదేశం) మీద కూర్చొని అది చెయ్, ఇది చెయ్, అలా చెయ్, ఇలా చెయ్ అని చెప్ప డానికి ఒక వ్యక్తి ఉండేవాడు. ఎండలో రెక్కలు ముక్కలు చేసుకునేవారి కంటే ఇతడి పని సుఖంగా ఉండేది. వాళ్లను చూసే ఈ మాట పుట్టింది!
✍🏼 నేటి కథ 

బోడి రూపాయ (సరదా జానపద కథ)

ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆ ముసల్ది చానా పిసినారిది. సచ్చినా ఒక్క పైసాగూడా ఎవరికీ ఇచ్చేది కాదు. ఆ ముసల్దాని దగ్గర ఒక ఇనప్పెట్టె వుండేది. అందులో వంద రూపాయలు వుండేవి. ప్రతిరోజు సాయంత్రం మచ్చు పై నుండి పెట్టె కిందకు దించి డబ్బులన్నీ లెక్క బెట్టుకోని మళ్ళా జాగ్రత్తగా పైన దాచి పెట్టేది.
ఆ ముసల్దానికి ఒక కోడలుంది. ఆమె ఇదేందబ్బా మా అత్త రోజూ పెట్టె దించి ఏందో ఎంచుతా వుందని ఒకరోజు అత్త బైటకు పోగానే పెట్టె దించి చూస్తే రూపాయ బిళ్ళలు కనబడినాయి. ఓహో! ఇదా సంగతని మట్టసంగా ఒక రూపాయ బిళ్ళ తీసుకోని బొడ్లో దాచి పెట్టుకోనింది.
సాయంత్రం అత్త వచ్చి ఎప్పట్లాగే పెట్టె దించి రూపాయలన్నీ ఎంచేసరికి ఒకటి తక్కువొచ్చింది. ఆమె అదిరిపడి ఇదేందబ్బా ఒకటి తక్కువొచ్చిందని మళ్ళా ఎంచింది. ఎన్నిసార్లు ఎంచినా ఒకటి తక్కువే వచ్చింది. 
అంతే... ఆ ముసల్ది “అమ్మో... నా రూపాయ పోయిందిరో నాయనో..." అని గట్టిగా కప్పెగిరి పోయేటట్టు ఒక్కరుపు అరచి దభీమని కిందపడిపోయింది.
కాసేపటికి ముసల్దాని కొడుకు పొలం నుంచి ఇంటికి వచ్చినాడు. ఇంటిబైట కూచున్న పెండ్లాంతో "మా అమ్మ యాడుందే" అనడిగినాడు. దానికామె “లోపలుంది. చూడుపో" అనింది. వాడు లోపలికి పోయి చూస్తే ఇంగేముంది... ముసల్ది నోరు తెరచి ఆకాశంలోకి చూస్తా చచ్చిందాని లెక్క పడుంది. ఎంత కదిపినా కదల్లేదు. 
దాంతో వాడు వాళ్ళమ్మ చచ్చిపోయిందనుకోని గట్టిగా ఏడ్చడం మొదలు పెట్టినాడు. వాని పెండ్లాం మాత్రం ఏమీ పట్టిచ్చుకోకుండా హాయిగా అరుగు మీద కూచోనింది.
వాడది చూసి "ఏమే! అత్త చచ్చిపోయిందనే బాధ కొంచెం గూడా లేదు నీకు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. కొంచం ఏడ్చే" అన్నాడు.
దానికామె "అప్పుడే ఏం ఏడ్చాల్లే. మీ బంధువులంతా వస్తారు గదా... అప్పుడు ఏడుస్తా" అనింది.
సాయంకాలనికి బంధువులంతా వచ్చినారు. అప్పుడు వాడు పెండ్లాంతో “ఏమే మన బంధువులంతా వచ్చినారు. ఇప్పుడన్నా ఏడ్చే" అన్నాడు.
దానికామె "అప్పుడే ఏం ఏడ్చాల్లే. మీ ఊరోళ్ళంతా వస్తారు గదా... అప్పుడు ఏడుస్తా" అనింది.
కాసేపటికి ఊరోళ్ళందరూ వచ్చినారు. అప్పుడు వాడు పెండ్లాంతో “ఏమే! ఊరోళ్ళంతా వచ్చినారు. ఇప్పుడన్నా ఏడ్చే" అన్నాడు.
దానికామె "అప్పుడే ఏం ఏడ్చాల్లే. శవాన్ని ఎత్తుతారు గదా... అప్పుడు ఏడుస్తా" అనింది.
కాసేపటికి ముసల్దాన్ని పాడె మీద కట్టి పైకి లేపినారు. అప్పుడు వాడు పెండ్లాంతో "ఏమే! శవాన్ని కాటికి తీసుకుపోతా వున్నారు. ఇప్పుడన్నా ఏడ్చే" అన్నాడు.
దానికామె “అప్పుడే ఏం ఏడ్చాల్లే. శవాన్ని శ్మశానం కాడ దించుతారు గదా... అప్పుడు ఏడుస్తా" అనింది.
కాసేపటికి ముసల్దాన్ని శ్మశానం కాడ దించినారు. అప్పుడు వాడు పెండ్లాంతో “ఏమే శవాన్ని శ్మశానం కాడికి గూడా తెచ్చినారు. ఇప్పుడన్నా ఏడ్చే" అన్నాడు.
దానికామె "అప్పుడే ఏం ఏడ్చాల్లే. శవాన్ని గుంతలోకి దించుతారు గదా... అప్పుడు ఏడుస్తా" అనింది.
కాసేపటికి శవాన్ని గుంతలో దించినారు. అప్పుడు వాడు పెండ్లాంతో “ఏమే! శవాన్ని గుంతలోనికి గూడా దించినారు. కనీసం ఇప్పుడన్నా ఏడ్చే" అన్నాడు.
అప్పుడామె గుంత దగ్గరికి పోయి ముసల్దాన్ని చూస్తా "ఓ అత్తా! ఇదిగో నీ రూపాయ పట్టు. ఎవరిక్కావాల నీ బోడి రూపాయ తీసుకో" అని గట్టిగా అరిచి ఆమె మీదికి విసిరికొట్టింది. అంతే... ముసల్ది "ఆ... నా రూపాయ దొరికిందా" అంటూ ఠక్కున పైకి లేచి కూచోనింది. అది చూసి అందరూ ఆమె పిసినాసితనానికి నోరెళ్లబెట్టారు.
*************************

తెలుసు కుందాం

🟥రక్తకణాలు ఎలా ఏర్పడతాయి? Blood cells formation - How?

శరీరంలోని రక్తంలో ఉండే ఎర్రరక్తకణాలు, రక్త పట్టీలు (ప్లేట్లెట్స్‌), సుమారు 70 శాతం తెల్ల రక్త కణాలు ఎముకల్లో ఉండే మూలగ (Bone Marrow) నుంచి తయారవుతాయి. మిగతా తెల్లరక్త కణాలు రససంబంధిత ధాతువుల (lymphatic tissues) నుంచి తయారవుతాయి.

ఎర్ర కణాలు, తెల్లకణాలు, దేహంలో మొదటి నుంచి ఉండే వంశానుగత కణాలు (Stem Cells) ద్వారా క్రమేపీ జరిగే అతిక్లిష్టమైన పరివర్తనం వల్ల ఎముకల్లోని మూలగలో ఉత్పన్నమవుతాయి. మూలగలో ఉండే రక్తకణం కేంద్రకం కలిగి ఉంటుంది. అయితే ఆ రక్తకణం మూలగ నుంచి వెలువడేటపుపడు తన కేంద్రకాన్ని పోగొట్టుకుంటుంది. అపుడా రక్తకణం అసంపూర్ణ కణం. అలా వెలువడిన కణం ఊపిరి తిత్తులలోని ప్రాణవాయువును గ్రహించి, దాన్ని కణ జాలాల్లోని (Tissue) కార్బన్‌ డై ఆక్సైడ్‌తో మార్పిడి చేసుకుంటుంది. రక్తకణాలు ముఖ్యంగా మూడు విధులను నిర్వర్తిస్తాయి. అందులో మొదటిది ఎర్రరక్త కణాలు ఆక్సిజన్‌ను రవాణా చెయ్యడమైతే, రెండవది తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధక కణాలుగా వ్యవహరించడం, మూడవది గాయాల నుంచి రక్తం అదేపనిగా కారిపోకుండా గడ్డ కట్టే ప్రక్రియలో తోడ్పడడం.

Thanks for reading Day 33: Students Summer Holidays Activities

No comments:

Post a Comment