Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, June 2, 2023

Day 34: Students Summer Holidays Activities


    

Day 34: Students Summer Holidays Activities


Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:34 Activities

Class: 1,2
34 వ రోజు

To develop Numaracy Skills:

Q) Collect the Sticks and make  bundles of  Ten

తెలుగు:

Q) కింది అక్షరాలకు ఒత్వం, ఓత్వం చేర్చి రాయండి. చదవండి.

క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, క్ష


English:

Q) Write the Missing letters.

Q u - e n

Q - i l l

Q u - z

Q u i - t

Q - e u e

Maths:

Q) Do the following Additions.

              3   8  6
              4   3  7
          +  2   1  3
        ...................
        ...................

              5   7   8
              3   9   5
          +  5   7   4
        ....................
        ...................

              7   0   6
              4   5   8
          +  2   6   9
        ...................
        ...................
ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Brought = తెచ్చెను.

Understand = అర్ధముచేసుకోను.

Worm = వెచ్చని.

Common = ఉమ్మడిగాయున్న.

Bring = తెచ్చెను.

Explain = వివరించు.

Dry = పొడిగాయున్న.

Though = అయునప్పటికిని.

Language = భాష.

Shape = ఆకారము.

Deep = లోతైన.

Thousands = వేలు.

Yes = అవును.

Clear = తేటయైన, నిర్మలమైన.

Equation = సమాసము










Class :3,4,5
34 వ రోజు 

Q) కాకి మరియు నక్క  కథను చదువుతూ మీ నోటు పుస్తకం లో రాయండి.

Q) Read and write the story 'The Crow And The Fox ' in your note book.
👇👇👇






💎 నేటి ఆణిముత్యం 

తనయూరి తపసి తనమును
తన పుత్రుని విద్య పెంపు దన సతి రూపున్
తన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ!

భావం : ఎంత వివేకం ఉన్న మనుష్యులయినప్పటికీ సొంత ఊరికి చెందిన తపశ్శక్తి సంపన్నుడినీ, కన్న కొడుకు ప్రదర్శించే తెలివితేటలను, సొంత భార్య అందచందాలను, ఇంటి పెరడులో ఉన్న చెట్టుయొక్క ఔషధగుణాలను మనస్సులో కూడా మెచ్చుకోరు.

ప్రతిపదార్థం : తన + ఊరి అంటే తను నివసించే గ్రామానికి చెందిన. తపసి అంటే తపస్సు చేసే వాని యొక్క. తపమును అంటే తపస్సును. తన పుత్రుని అంటే తన సొంత కుమారుని యొక్క. విద్య పెంపున్ అంటే చదువులో గల తెలివితేటలను. తన సతి అంటే తన భార్య యొక్క. రూపున్ అంటే సౌందర్యాన్ని. తన పెరటి అంటే తన ఇంటి పెరడులో ఉన్న. చెట్టుమందును అంటే ఔషధ వృక్షాలను. ఎట్టి అంటే ఎంత వివేకం ఉన్న. మనుజులున్ అంటే మనుష్యులు అయినప్పటికీ. మనసునన్ అంటే చిత్తంలో. వర్ణింపరు అంటే ప్రశంసించరు లేదా మెచ్చుకోరు.

పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుంది... అని సామెత ఉండనే ఉంది. తమ కుమారుడు ఎంత తెలివిగలవాడైనప్పటికీ, పక్కింటి అబ్బాయిని మెచ్చుకుంటారు. తమ గ్రామంలోనే ఎంతో పండితుడు ఉన్నప్పటికీ అతడిని గుర్తించరు. తన భార్య ఎంత అందంగా ఉన్నా కూడా పక్కింటి భార్య అందాన్నే పొగుడుతారు. అలాగే తమ ఇంట్లోనే ఔషధవృక్షం ఉన్నా కూడా దానిని ఔషధంగా అంగీకరించరు. అందుకే పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదు అని, దూరపుకొండలు నునుపు అని అంటారు. అందుబాబులో ఉన్నవాటిని నిర్లక్ష్యం చేసి అందని ద్రాక్షల కోసం ప్రయత్నించడం మానవ లక్షణం. ఈ పద్యంలో కవి ఆ విషయాన్ని వివరించాడు.

👬 నేటి చిన్నారి గీతం 

చెమ్మచెక్క

చెమ్మ చెక్క ఆడుదమా!
చేతులు రెండు కలుపుదమా!
చప్పట్లోయ్ తాళాలోయ్
అంటు పాడుదమా!
దేవునికి దాండాలు పెట్టెదమా!
కాళ్ల గజ్జె ఆడుదమా!
కాళ్ళు రెండు చాచుదమా!
ఒప్పులకుప్ప ఆడుదమా!
ఒయ్యారంగా తిరుగుదమా!
దాగుడుమూతలు ఆడుదమా!
కళ్ళకు గంతలు కట్టుదమా!
బొమ్మలపెళ్ళి చేద్దామా!
తూతూబాకా లూదుదమా!
పప్పు బెల్లాం కమ్మగ తిందామా!!
చెమ్మ చెక్క ఆడుదమా! చేతులు రెండు కలుపుదమా!!!

🤘నేటి సుభాషితం

అభిమానం అప్పు లాంటిది..దాన్ని ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది...దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి.

🤠 నేటి సామెత 

సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి

సీత చరిత్రలో నిలిచిపోయిన ఒక మహా సాధ్వి. పీత ఒక సామాన్య జీవి. కాని ఎవరి కష్టాలు వారివి. ఎవరికైనా సరే ఇతరుల సమస్యలు మన సమస్యలతో పొలిస్తే తక్కువగానే కనపడతాయి.

🗣నేటి జాతీయం

చిలక చదువు!

‘చదువుకున్నాడన్న మాటేగానీ... అంతా చిలక చదువు’ అంటుంటారు కొందరు. అంటే అర్థం ఏమిటి? చదువు అనేది ‘ఇంతవరకే’ ‘ఇక్కడి వరకే’ అని ఉండదు. అదొక తీరని జ్ఞానదాహం. కొందరు మాత్రం కొంత చదువుకొని ‘ఇక తమకు అంతా వచ్చేసింది’ అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సామాజిక స్థితిగతులు, ధోరణులు వేటి గురించీ అవగాహన ఉండదు. నేర్చుకున్న దానికంటే ఒక్క అక్షరం ముక్క కూడా ఎక్కువ తెలియదు వీరికి. చిలకకు చదువు చెబితే, మనం ఎక్కడి వరకు చెబితే అక్కడి వరకే నేర్చుకుంటుంది. మరింత నేర్చుకోవాలనే ఆసక్తి దానికేమీ ఉండదు. నేర్చుకున్న దాని కంటే ఎక్కువ తెలివినీ ఉపయోగించదు. కొందరు మనుషులు కూడా అంతే అని చెప్పడమే ఈ జాతీయం ఉద్దేశం.
✍🏼 నేటి కథ 

ఎన్ని ఆశలో చిన్నిగుండెలోన.. నీతిమంతమైన ఓ పిట్ట కథ..

అనగనగా ఒక ఊళ్ళో ఒక నది. ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు..

ఆ దారిన వెళుతున్న ఒక చిన్న పిట్ట తనకూ తన పిల్లలకు ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని, మొదటి చెట్టు దగ్గరకు వెళ్లి అడిగింది, "వర్షాకాలం వస్తోంది, నేను నా పిల్లలు ఉండటానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా?" అంది.

"వద్దు ", అనేసింది మొదటి చెట్టు..

ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది. నిరాశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహాయం కోసం వేడుకుంది.

"సరే ", అంది రెండో చెట్టు. 

మహదానందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలు పెట్టింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది..

పిట్ట, పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం వచ్చేసింది..

అంతలో పెద్ద వర్షం. వర్షం పెద్దదైంది. వరద రావడం మొదలైంది. ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేళ్ళతో సహా కూలి పోయి, నీటిలో కొట్టుకుని పోతోంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ,

"భగవంతుడు నీకు శిక్ష వేసాడు. నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా", 
అంది నవ్వుతూ.

"నేను బలహీనమైనదానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకుని పోతానని కూడా తెలుసు. నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకుపోకూడదనే నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను నేను. 
నన్ను క్షమించు. నువ్వు పది కాలాలు సుఖంగా ఉండు", అంది ఆనందంగా.. 

ఆ చిన్న పిట్ట చిన్ని గుండెలో సముద్రమంత ఆవేదన..

నీతి: ఎవరైనా నిరాకరిస్తే వారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వారి పరిస్థితి ఏమిటో వారికే తెలుస్తుంది.

ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది..

తెలుసు కుందాం

🟥జంతువులు, పక్షులు-ప్రకృతి వైపరీత్యాలను ఎలా పసిగడతాయి? Can Animals and birds Predict Disaster?

జీవులన్నింటికీ పరిశీలన శక్తి, సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకి మనం వంద అడుగుల దూరంలో ఉన్న ఈగను చూడలేం. కానీ గద్ద వేల అడుగుల దూరంలో ఉండే జంతువును కూడా చూడగలదు. భూకంపాలు, తుపాన్లు, సునామీలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఒక్క ఉదుటన ఏ విధమైన ముందస్తు సంకేతాలు లేకుండా రావు. అలాంటి సందర్భాల్లో ప్రకృతిలో చోటు చేసుకునే సున్నితమైన మార్పుల్ని కొన్ని పక్షులు, జంతువులు గ్రహించగలుగుతాయి. ఉదాహరణకు గాలిలో కలిగే మార్పులు, భూమిలో ఏర్పడే కంపనాల్ని, వాతావరణంలో హఠాత్తుగా మారే తేమ శాతం లాంటి వివరాలను అవి గుర్తించగలుగుతాయి. తద్వారా అవి ప్రకృతి వైపరీత్యాలను కొంత మేరకు ముందే పసిగట్టగలవు. అలాగని 2 సంవత్సరాల తర్వాతో, రెండు నెలల తర్వాతో రాబోయే వాటిని అవి కూడా గుర్తించలేవు.

Thanks for reading Day 34: Students Summer Holidays Activities

No comments:

Post a Comment