Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 3, 2023

Day 35: Students Summer Holidays Activities


    

Day 35: Students Summer Holidays Activities


Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:35 Activities


Class: 1,2
35 వ రోజు

To develop Numaracy Skills:

Q) Collect the Sticks and make  bundles of  Ten

తెలుగు:

Q) కింది అక్షరాలకు ఔత్వం చేర్చి రాయండి. చదవండి.

క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, క్ష


English:

Q) Learn and write ' R ' words.

Rose.  🌹

Run.  🏃‍♀

Ring.  💍

Red.  🛑

Road.  🛣️

Roller.  🎢

Ribbon.  🎗️

Maths:

Q) Do the following Subtractions .

                 8  9
                 3  7
          -    
        ...................
        ...................

                 7   8
                 5   5
          -  
        ....................
        ...................

              7      6
              4      8
          -        
        ...................
        ...................


ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Yet =ఇంకనూ.

Government =ప్రభుత్వము.

Can’t = సాధ్యముకాని.

Matter = విషయము.

Square = చదరము.

Syllables = సంగ్రహము, పాఠ్యభాగము.

Perhaps =బహుశా.

Bill = చట్టము, లెక్క,చీటి.

Felt = అనుభూతి పొందెను.

Suddenly = అకస్మాత్తుగా.

Test = పరీక్ష.

Direction =దర్శకత్వం.

Center = మధ్యన.

Formers =వ్యవసాయదారులు.

Ready = సిద్ధముగా ఉండు.













Class :3,4,5
35 వ రోజు 

కాకి మరియు నక్క కథ లోని కీలక పదాలను గుర్తించి ' సున్నా ' చుట్టండి. చదువుతూ 5 సార్లు  మీ నోటు పుస్తకం లో రాయండి. 

Q) Identify and circle the key words in the story 'The Crow And The Fox '. Read and write the key words 5 times in your note book.
👇👇👇




💎నేటి ఆణిముత్యం

మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై
వనరి వనరి వనరి పక్కి పక్కి
తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు
విశ్వదాభిరామ వినురవేమ!

భావం:-

తత్వము తెలియని మూర్ఖులు పుణ్యతీర్ధాలలో మునిగినా, కాకులవలే దేవాలయాలన్ని తిరిగినా, కడుపు కాల్చుకుని ఉపవాసాలు చేసినా ముక్తి లభించదు.

👬 నేటి చిన్నారి గీతం

కన్నతల్లి సేవ

మముగన్న భారతమాత మందిరమున 
దివ్వెలై మన ముందామా
దివ్వెలై మన ముందామా 

పరమ పావని తల్లి పాదపూజల వాడు 
పువ్వులై మన ముందామా
పువ్వులై మన ముందామా

భారతీదేవి విపంచిక రవళించు
తంత్రులై మన ముందామా 
తంత్రులై మన ముందామా 

జన్మభూమి శౌర్య సౌరభ్యములు చల్లు 
గీతలై మన ముందామా
గీతలై మన ముందామా


కదన వీరుల చేతి ఖడ్గధారలలోని 
మెఱుపులై మన ముందామా
మెఱుపులై మన ముందామా

🤘నేటి సుభాషితం

ఈ ప్రపంచమంతా నీకు దూరంగా వెళ్ళినప్పుడు నీకు దగ్గరగా వచ్చేవాడే నీ నిజమైన స్నేహితుడు.

🗣నేటి జాతీయం

ఎంత పండినా కూటిలోకే

ఎంత పండినా కూటిలోకే, ఎంత ఉండినా కాటిలోకే .పంట ఎంత పండినా దాన్ని కలకాలం నిల్వ ఉంచరు. ఆహార పదార్థంగా ఆ పంట మారాల్సిందే.అలాగే నూరేళ్లు బతికినా అంతకంటే ఎక్కువ బతికినా, అంత ఎక్కువకాలం బతికాడని మరణించాక అతడిని ఇంట్లో ఉంచుకోరు. కాటికి పంపాల్సిందే. అంటే ఎప్పటికో ఒకప్పటికి మరణం తప్పదు కనుక ప్రాణం ఉన్న రోజుల్లోనే జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలనే సూచన

🤠 నేటి సామెత 

హనుమంతుడి ముందా కుప్పిగంతులు

హనుమంతుడు అంటే కోతి కదా. కోతి అంటేనే కుప్పి గంతులు వేసి ఇల్లు పీకి పందిరి వేసి అల్లరి చేసేది. అలాటి కోతి జాతి నుండి పుట్టిన హనుమంతుడి ముందు కోతి చేష్టలు చేస్తే విచిత్రంగా ఉంటుంది కదా. ఏదైనా విషయం బాగా తెలిసిన వారి దగ్గర దాని గురింఛి చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.
✍🏼 నేటి కథ 

తెలివితేటలుంటే ఏదైన సాద్యమే..

తెలివితేటలుంటే ఏదైన సాద్యమే అని మన తల్లీదండ్రులు అంటూవుంటారు.తెలివితేటలకు పెద్దవాళ్లు చిన్నవాళ్లు అని తేడా లేదు. చిన్న పిల్లలు తమ మేధాశక్తితో పెద్దవాళ్లను ఆశ్చర్య పరిచే ప్రతిభ ప్రదర్శిస్తుంటారు.

లింగాపురం అనే ఊరిలో సుబ్బయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు.వారిలో ఒకరికి తన వ్యాపారం బాద్యతలు అప్పగించాలిని అనుకుంటున్నాడు సుబ్బయ్య. అయితే ఇద్దరి కొడుకుల్లో ఎవరు తెలివైనవారో తెలుసుకుని వారికీ వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులుకు ఒక పరీక్షపెడతాడు సుబ్బయ్య. అందులో ఎవరు నెగితే వారికీ వ్యాపారం బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు.కొడుకులిద్దరకి కొంత డబ్బును ఇచ్చిన సుబ్బయ్య ఈ డబ్బుతో ఎవరైతే ఇంటినిపూర్తిగా నింపగల వస్తవులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు.దీనితో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపళంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్దకొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటి గురుంచి 

అడిగి తెలుసుకున్నాడు. తండ్రి యించిన డబ్బుతో మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు. 

రెండోకొడుకు మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంత తెలివితేటలతో పూర్తిగా చేయాలని దీర్ఘంగా ఆలోచించాడు. చివరకి ఒక రూపాయని ఖర్చుచేసి ఒక కొవ్వతిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగు వెంటనే దానిని వెలిగించగానే ఇల్లంతా వెలుగు పరుచుకుంటుంది. దీన్ని చూసిన సుబ్బయ్య తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతోనింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికి వ్యాపార భాద్యతలను అప్పజెబుతాడు. సారిక ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరకి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు సుబ్బయ్య. తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు అలాగె తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు. నిజజీవితంలో చాలా మంది చదువు లేకపోయినా తెలివితో వ్యాపారం చేస్త్తున్నారు.....!!

తెలుసు కుందాం

🟥ఒక వైరుతో విద్యుత్‌ ప్రసారం చేయలేరా? Can not transmit Electricity with single wire?

ఏదైనా విద్యుత్‌ పరికరం పని చేయాలంటే అందులో కీలకమైన విద్యుత్‌ వలయం (electrical circuit)లో విద్యుత్‌ ప్రవాహం జరగాలి. నదిలో నీరు ప్రవహించినట్టే ఆ విద్యుత్‌ వలయంలో ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి. నదికి నీరు వచ్చే దిశ, వెళ్లే దిశ ఉన్నట్టే విద్యుత్‌ పరికరానికి ఎలక్ట్రాన్లు చేరే చివర (terminal), ఎలక్ట్రాన్లు పోయే చివర అంటూ రెండు ధ్రువాలు ఉండాలి. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఒక ధ్రువాన్ని భూమికి కలిపి రెండో ధ్రువాన్ని విద్యుద్వాహినిగా చేస్తారు. భూమికి కలిపిన చివరను న్యూట్రల్‌గాను, విద్యుత్‌ ప్రవహించే తీగను ఫేజ్‌ లేదా లైన్‌ అనే పేరుతోను వ్యవహరిస్తారు. అవే రెండు తీగలు. ప్రతి సారీ మనం ఇళ్లలో గొయ్యి తవ్వి భూమికి ఒక వైరును తగిలించలేము కాబట్టి ఇళ్లకు వచ్చే సరఫరాలోనే భూమిని కలిపే సదుపాయమే న్యూట్రల్‌. ఇక బ్యాటరీల విషయానికి వస్తే విధిగా రెండు తీగలను (ధన, రుణ ధ్రువాలు) ఉండాలి. ఇక్కడ ఒక తీగ పనిచేయదు. ఎందుకంటే బ్యాటరీలోనే విద్యుత్‌ ప్రవాహం ఆరంభమవుతుంది కాబట్టి తిరిగి ఎలక్ట్రాన్లు అక్కడికే చేరాలి. లేకపోతే వలయం తెగిపోతుంది.

Thanks for reading Day 35: Students Summer Holidays Activities

No comments:

Post a Comment