Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 17, 2023

Father's Day Wishes: Wish your father with love in Telugu


 Fathers day  Wishes: నాన్నకు ప్రేమతో ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

ప్రతి బిడ్డ ఎక్కే తొలి విమానం తండ్రి భుజాలే. ఏ బిడ్డకైనా తన నాన్నే తొలి హీరో. పిల్లలే లోకంగా జీవించే నాన్నది నిస్వార్థ ప్రేమ. అనుక్షణం పిల్లల కోసం డబ్బు సంపాదించే పనిలో బిజీగా ఉండే నాన్న కష్టాన్ని గుర్తించే రోజు 'ఫాదర్స్ డే'.

ఈ ఆదివారం (జూన్ 16,2024) ఫాదర్స్ డే. ఈ రోజున మీ తండ్రిని ప్రేమతో తెలుగులోనే విష్ చేయండి.


1. నాన్నని ప్రేమించండి

ఎందుకంటే మీ ముఖంలో

చిరునవ్వు చూడడం కోసం

తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న

హ్యాపీ ఫాదర్స్ డే


2. పిల్లలకి మొదటి గురువు

స్నేహితుడు, మార్గదర్శి

... అన్నీ నాన్నే

హ్యాపీ ఫాదర్స్ డే


3. నీ ఆశలే తన ఆయువుగా..

నీ గెలుపే తన లక్ష్యంగా...

నీ జీవితాన్ని నిలబెట్టేందుకు...

నీ కోసం నిత్య శ్రమించే

నిస్వార్థ శ్రామికుడు

మీ నాన్న...

హ్యాపీ ఫాదర్స్ డే


4. గెలిచినప్పుడు ఆనందంగా

పదిమందికి చెప్పుకుని

ఓడినప్పుడు మన భుజం తట్టి

గెలుస్తావులే అని దగ్గరికి

తీసుకునే బంగారు వ్యక్తి

మా నాన్న...

హ్యాపీ ఫాదర్స్ డే


5. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న

మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి నాన్నా...

హ్యాపీ ఫాదర్స్ డే


6. నాన్నంటే ఓ ధైర్యం

నాన్నంటే ఓ బాధ్యత

నాన్నంటే ఓ భద్రత

నాన్నంటే ఓ భరోసా

అన్నింటికీ మించి త్యాగానికి మారుపేరు నాన్న

హ్యాపీ ఫాదర్స్ డే


7. ఆకాశంలా గంభీరంగా గర్జించినా, ఉరిమినా...

అంతలోనే చల్లనైన కరుణా వర్షాన్ని కురిపించడం..

ఒక్క నాన్నకే సాధ్యం

హ్యాపీ ఫాదర్స్ డే


8. నాన్న నా ఆశ

నా శ్వాస

నాన్నా అందుకో...

పితృ దినోత్సవ శుభాకాంక్షలు


9. నాన్న మనకి ఓ ఇంటి పేరునే కాదు,

సమాజంలో మంచి పేరుని కూడా ఇస్తారు నాన్నా

హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.


10. ప్రతి విజయంతో వెనుక ఉంటూ

బాధలోనైనా నేనున్నానని

ఆసరా ఇచ్చే వ్యక్తి... నాన్న

పితృ దినోత్సవ శుభాకాంక్షలు


11. నాన్న చూపిన బాటలో

విజయం ఉంటుందో లేదో తెలియదు, కానీ

అపజయం మాత్రం ఉండదు

హ్యాపీ ఫాదర్స్ డే


12. జీవితంలో మనల్ని ముందుకు నడిపించి...

తాను మాత్రం వెనుకే ఉండిపోతాడు నాన్నా

అలాంటి నిస్వార్థ ప్రేమకు

హ్యాపీ ఫాదర్స్ డే


13. నాన్నా, ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి మీరు,

మీరెప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి.

హ్యాపీ ఫాదర్స్ డే


14. నాన్న ఎప్పుడూ నాకు మొదటి స్నేహితుడు

ఆత్మ బంధువు, గురువు, దైవం... అన్నీ. 

హ్యాపీ ఫాదర్స్ డే


15. నాన్నా...

నా బెస్ట్ ఫ్రెండ్ మీరే

నా మంచి, చెడు, ఆనందం, విజయం...

అన్నింటి వెనుక మీరే ఉన్నారు

నా కోసం ఎంతో త్యాగం చేశారు

పితృ దినోత్సవ శుభాకాంక్షలు


16. నాన్న మాటల్లో ప్రేమ ఉంటుంది

అతని కోపంలో బాధ్యత ఉంటుంది

అనుక్షణం బిడ్డ గురించే అతని ఆలోచనలు

ప్రతి తండ్రికి పితృ దినోత్సవ శుభాకాంక్షలు


17. మనలో జీవాన్ని నింపి..

అల్లారు ముద్దుగా పెంచి...

మనలోని లోపాలను సరిచేస్తూ...

మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ...

మనకు గమ్యం చూసేది నాన్న.

అనురాగానికి రూపం నాన్న

హ్యాపీ ఫాదర్స్ డే


18. మనమెక్కిన తొలి విమానం 

మన తండ్రి భుజాలే

పితృ దినోత్సవ శుభాకాంక్షలు


19. మనం తినే తిండి

కట్టుకునే బట్ట

చదివే చదువు

తనవల్లే వచ్చాయని

ఒక్కరోజు కూడా భావించని

ప్రత్యక్ష దైవమే నాన్న

ఫాదర్స్ డే శుభాకాంక్షలు


20. నాన్న అంటే నమ్మకం

ఆత్మస్థయిర్యాన్ని పెంచే ఆయుధం

పితృ దినోత్సవ శుభాకాంక్షలు

Thanks for reading Father's Day Wishes: Wish your father with love in Telugu

No comments:

Post a Comment