AP SSC: ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో జూనియర్ అసిస్టెంట్, డీపీఏ పోస్టులు
విజయవాడలోని ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం… ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్/ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
1. జూనియర్ అసిస్టెంట్: 11 పోస్టులు
2. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 01 పోస్టు
వేతనం: నెలకు జూనియర్ అసిస్టెంట్‌కు రూ.18,500; డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌కు రూ.18,500.
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. టైపింగ్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్/ పీజీడీసీఏ/ డీసీఏ/ ఇంజినీరింగ్ సర్టిఫికేట్/ కంప్యూటర్ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్ష ఫీజు: రూ.500.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి/ ఇంటర్మీడియట్/ డిగ్రీ మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మార్కుల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 07.07.2023.
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 11.07.2023.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ: 13.07.2023, 14.07.2023.
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్: 16.07.2023, 17.07.2023.
తుది ఎంపిక జాబితా వెల్లడి: 19.07.2023.
Thanks for reading Junior Assistant and DPA Posts in AP SSC Board
No comments:
Post a Comment