NAVODAYA 6TH CLASS ADMISSION NOTIFICATION 2024-25 - ONLINE APPLICATION
దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల చేసినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. . ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆●●●●●
JNV: జవహర్ నవోదయ విద్యాలయ-ఆరో తరగతి ప్రవేశాలు
జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ) 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2024 ద్వారా దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
వివరాలు...
* జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2024
అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి.
వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 1.5.2012 నుంచి 30.07.2014 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
ప్రవేశ పరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్, లాంగ్వేజ్) ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.08.2023 17.08.23
The last date to submit online application is 31st August, 2023.
జేఎన్‌వీ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
Thanks for reading NAVODAYA 6TH CLASS ADMISSION NOTIFICATION 2024-25 - ONLINE APPLICATION
No comments:
Post a Comment