Aadhaar-Pan: పనిచేయని వారి పాన్‌కార్డ్.. ఏం చేయాలో చెప్పిన ఆదాయపుపన్ను శాఖ..
Aadhaar-Pan: పాన్-ఆధార్ కార్డులను లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. గడువు తర్వాత లింక్ చేసుకోని కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ గతంలోనే హెచ్చరించింది.
తాజాగా లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయని NRIల పాన్ కార్డులు ప్రస్తుతం పనిచేయటం లేదు. దీంతో చాలా మంది ప్రవాస భారతీయులు మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లను(SIP) ప్రాసెస్ చేయడంలో, వారి IT రిటర్న్‌లను ఫైల్ చేయడంలో, టాక్స్ రిఫండ్స్ క్లెయిమ్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఎన్నారైలు ఇప్పుడు 'పనిచేయని' పాన్ కార్డులతో అసౌకర్యానికి గురవుతున్నారు.
ఒక వ్యక్తి ఆధార్ కార్డ్ నంబర్‌ను పొందేందుకు అర్హత కలిగి ఉంటే.. దానిని సెక్షన్ 139AA(2) ప్రకారం వారి పాన్ కార్డ్‌తో లింక్ చేయడం తప్పనిసరి. అయితే ఎన్నారైలు ఆధార్ నంబర్‌ను పొందాల్సిన అవసరం లేదు. వారు తమ పాన్-ఆధార్ నంబర్‌లను కూడా లింక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎన్‌ఆర్‌ఐలు గత కొన్నేళ్లుగా నాన్ రెసిడెంట్‌లుగా పన్నులు దాఖలు చేస్తున్నప్పటికీ, రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వారి నివాస స్థితిపై ఆదాయపు పన్ను పోర్టల్‌ను అప్‌డేట్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ ఆదేశించింది.
పాన్-ఆధార్ లింకింగ్ ప్రభావం ప్రధానంగా దేశీయ ఆదాయ పన్ను చెల్లింపుదారులపై దృష్టి సారించింది. కానీ అంతర్జాతీయ పన్ను చెల్లింపుదారులకు ఇది నేరుగా వర్తించదు. ఇంతకుముందు NRIలు పాన్-ఆధార్ కార్డులను లింక్ చేయకపోతే అధిక TD S, TCS మొదలైన వాటి రూపంలో భారీ జరిమానాలు విధించబడతాయని ఆందోళన చెందారు. అయితే చాలా మంది ఎన్నారైలు అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత కూడా వారి పాన్ కార్డ్ పని చేయని కారణంగా జూలై 1 నుంచి గందరగోళంలో ఉన్నారు.
CBDT NRIల కోసం ప్రత్యేకంగా పొడిగిస్తే తప్ప, NRIలు 31 జూలై గడువు తర్వాత IT రిటర్న్‌ను ఫైల్ చేయలేరని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఆలస్య రుసుముతో రిటర్న్ దాఖలు చేయాలన్నా పాన్ యాక్టివ్ గా ఉండటం తప్పనిసరి. ఈ క్రమంలో NRIలు తమ నివాస స్థితి, వ్యవధిని చూపించడానికి వారి పాన్ కార్డ్ కాపీతో పాటు పాస్‌పోర్ట్ కాపీ, ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఇది వారి పాన్ డేటాబేస్‌లో వారి నివాస స్థితిని తెలుసుకోవడానికి, అప్‌డేట్ చేయడానికి IT విభాగానికి సహాయపడుతుంది.
Thanks for reading Aadhaar-Pan: Inoperative PAN Card.. Income Tax Department told what to do..
No comments:
Post a Comment