Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 27, 2023

AP Grama/Ward Sachivalayam Jobs 2023


 AP Grama/Ward Sachivalayam Jobs 2023 : ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ.. ఈ ఉద్యోగాల నియామకాలకు ఉత్తర్వులు.. పూర్తి వివరాలు ఇవే..

కరోనా మహమ్మారితో మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో కొందరికి ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పు­న ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్‌రెడ్డి జూలై 26వ తేదీన (బుధవారం) ఉత్తర్వులు జారీచేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను..

రాష్ట్రంలో ఇలా మృతిచెందిన ప్రభు­త్వోద్యోగుల కుటుంబాల్లోని వారికి ఇప్పటివరకు 1,488 మందికి ప్రభుత్వం ఉద్యో­గాలు కల్పించింది. మిగిలిన 1,149 మంది దరఖాస్తు­దారులకూ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేశారు. వీటిల్లో మొత్తం 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిల్లో ఆ 1,149 దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కారుణ్య నియా­మకాల కింద ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాల్సిందిగా సీఎస్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్హతలు, రిజర్వేషన్‌ రోస్టర్‌ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆయన ఆదేశించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులివే..

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్య­దర్శి, డిజిటల్‌ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరి­పాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, తది­తర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పే­ర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు.

ఈ ఉద్యోగాలకు రూల్స్ ఇవే..

☛ ఇక ఈ కారుణ్య నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్‌లైన్‌ను కూడా నిర్దేశించింది. 

☛ దరఖాస్తుల పరిశీలన ఆగస్టులోగా పూర్తిచేయాలి.. అర్హులైన వారికి నియామక పత్రాలను ఆగస్టు 24లోగా జారీచేయాలి.

☛ సమ్మతి నివేదికను సెప్టెంబర్‌ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. 

☛ మృతిచెందిన ఉద్యోగికి మైనర్‌ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 

☛ ఉద్యోగ నియామక పత్రం జారీచేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. 

☛ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీచేయాలి.

గత నిబంధనలకు స్వస్తీ..

కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఉద్యోగులు రెండేళ్లలోపు కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు స్పష్టంచేశారు. ఈ మేరకు గత నిబంధనలను సడలించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు.

Thanks for reading AP Grama/Ward Sachivalayam Jobs 2023

No comments:

Post a Comment