Chandrayaan 3 Countdown: రేపే చంద్రయాన్ 3 ప్రయోగం, ప్రారంభమైన కౌంట్‌డౌన్, ప్రయోగం ఎలా జరుగుతుందంటే
Chandrayaan 3 Countdown: దేశ ప్రజలే కాదు..ప్రపంచం మొత్తం ఇప్పుడు రేపు జరగనున్న చంద్రయాన్ 3 ప్రయోగంవైపు చూస్తోంది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానున్న చంద్రయాన్ 3 ప్రయోగం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అత్యంత కీలకమైన, ఉత్కంఠ భరితమైన కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు మద్యాహ్నం 2.35 గంటలకు చంద్రమండలంలోకి రాకెట్ దూసుకెళ్లనుంది.
ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగం రేపు అంటే జూలై 14వ తేదీ మద్యాహ్నం 2.35 గంటలకు జరగనుంది. బాహుబలి రాకెట్‌గా పేర్కొనే LVM-3-M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కావచ్చని ఇస్రో అంచనా. ఇంతకుముందు
2019 జూలైలో ప్రయోగించిన చంద్రయాన్ 2 చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో విఫలమైంది.ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఇస్రో శాస్ట్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రయోగాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది. రేపు మధ్యాహ్నం జరగాల్సిన చంద్రయాన్ 3 ప్రయోగం కోసం ఇవాళ మద్యాహ్నం 1.05 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రయాన్ 3ను ప్రయోగించే ఎల్‌విఎం 3 రాకెట్‌పైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇస్రో అభివృద్ధి చేసిన ఈ రాకెట్ అత్యంత శక్తివంతమైంది. భారీ పరిమాణంలోని పేలోడ్‌ను సులభంగా మోసుకెళ్లగలదు. దశలవారీగా ఇంధనాన్ని మండించడం ద్వారా రాకెట్ ను నింగిలోకి పంపిస్తారు. ఘన, ద్రవ ఇంధన ఇంజన్లు, స్టాప్ ఆన్ బూస్టర్లు నిర్దేశిత సమయాల్లో పనిచేస్తాయి. ఈ రాకెట్ బరువు 640 టన్నులు ఉంటుంది. 4 వేల కిలోల పేలోడ్ జయో సింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి మోసుకెళ్తుంది.
చంద్రయాన్ -3 అనేది భారత చంద్రయాన కార్యక్రమంలో మూడవది. చంద్రయాన్-2 లో ఉన్నట్టే ఇందులో కూడా ఒక రోవర్, ఒక ల్యాండర్‌ను పంపిస్తారు. కానీ ఇందులో ఆర్బిటర్ ఉండదు. దీని ప్రొపెల్ర్ మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్లర్ మాడ్యూల్ చంద్రుని చుట్టూ 100 కిలోమీటర్ల కక్ష్య వరకూ ల్యాండర్, రోవర్‌ను తీసుకెళ్లగలదు. చంద్రయాన్ 3 ప్రాజెక్టు కోసం ఇస్రో 615 కోట్లు ఖర్చుపెడుతోంది. ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 25 గంటల 30 నిమిషాలు కొనసాగుతుంది.
సుమారు 3,84,000 కి.మీ. ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. ఆ తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది. దీనిలో ఆర్బిటర్‌ను పంపడంలేదు. చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. దాన్నే ఇప్పుడు వినియోగించుకోనున్నట్లు ఇస్రో ఇదివరకు వెల్లడించింది.
చంద్రుడి (Moon Mission)పై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఈ సారి అని చర్యలూ తీసుకున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది. గత వైఫల్యాన్ని విశ్లేషించుకొని, దాన్ని అధిగమించేలా (ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్) చంద్రయాన్-3 (Chandrayaan-3)ని రూపొందించామని పేర్కొంది. అనుకోని అవాంతరం తలెత్తినా ల్యాండర్.. విజయవంతంగా చంద్రుడిపై దిగేలా కసరత్తు చేపట్టినట్లు తెలిపింది. ఈసారి ల్యాండింగ్‌కు లక్ష్యంగా కొంత విశాలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్-3లో ఇంధన పరిమాణాన్నీ పెంచామని, అందువల్ల అవసరమైతే అది ప్రత్యామ్నాయ ల్యాండింగ్ ప్రదేశాకి చేరుకోగలదని వెల్లడించింది.
ఇప్పటి వరకు అమెరికా (USA), రష్యా (Russia), చైనా (China) దేశాలు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహక నౌకలను ల్యాండ్ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా 2019లో చంద్రయాన్-2 (Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టింది. అయితే, చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్ సమయంలో విఫలమైంది. అంతకుముందు.. 2008లో చంద్రయాన్-1 (ల్యాండర్ లేకుండా ఆర్బిటర్, ఇంపాక్టర్‌తో జరిపిన ప్రయత్నం)ను చేపట్టింది. తాజాగా చేపడుతోన్న చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైతే మాత్రం భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడినట్లే..!
Thanks for reading Chandrayaan 3 launch tomorrow, countdown started, how the launch will be don
No comments:
Post a Comment