Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, July 24, 2023

DRDO Recruitment


 DRDO Recruitment: బీటెక్ అభ్యర్థులకు శుభవార్త.. DRDOలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారికి వెబ్ సైట్ ను సందర్శించి rac.gov.in ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం పోస్టులు 55 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 11గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు..

జనరల్, OBC మరియు EWS పురుష అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.100. SC/ST/PWD మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

అర్హతలు..

సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్, సివిల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి..

ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'F' ఉద్యోగాలకు అభ్యర్థి వయస్సు 55 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'ఈ'కి గరిష్ట వయస్సు 50 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'డి'కి గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు.

ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'సి'కి గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు.

ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'B'కి అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

-DRDO అధికారిక వెబ్‌సైట్ rac.gov.in లో సందర్శించండి

-ఆ తర్వాత హోమ్‌పేజీలో అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 146 కింద వర్తించు లింక్‌పై క్లిక్ చేయండి.

-అప్పుడు దరఖాస్తు ఫారమ్ నింపండి.

-ఆ తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.

-ఇప్పుడు ఫారమ్‌ను సమర్పించి.. భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

Thanks for reading DRDO Recruitment

No comments:

Post a Comment