EPF Withdrawal: పెళ్లికి, కొత్త ఇంటికి ఈపీఎఫ్ ఖాతా నుంచి ఎంత డ్రా చేయొచ్చు? తెలుసుకోండి.
1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారికి అలర్ట్. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసిన డబ్బుల నుంచి అవసరానికి విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావెడింట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).
పెళ్లి, విద్యాభ్యాసం, ఆస్పత్రి ఖర్చులు, ఇంటి నిర్మాణం... ఇలా వేర్వేరు కారణాలతో ఉద్యోగులు డబ్బులు డ్రా చేయొచ్చు.
2. ఈ కారణాలతో చాలామంది ఉద్యోగులు తమ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేస్తుంటారు. అయితే ఏ కారణానికి ఎంత మొత్తం వస్తుందన్న విషయం ఉద్యోగులకు తెలియదు. క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత, అకౌంట్‌లో డబ్బులు పడితే తప్ప తమకు ఎంత వస్తుందన్న అంచనా ఉండదు. ఈపీఎఫ్ విత్‌డ్రా రూల్స్ వేర్వేరుగా ఉంటాయి. కారణాన్ని బట్టి మీకు వచ్చే మొత్తం ఉంటుంది. మరి ఏ కారణానికి మీరు ఎంత డ్రా చేయొచ్చో తెలుసుకోండి.
3. Marriage or Education: ఈపీఎఫ్ ఖాతాదారులు పెళ్లి కోసం 50 శాతం డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. అయితే విత్‌డ్రా చేయాలనుకుంటే ఏడేళ్ల సర్వీస్ కాలం పూర్తై ఉండాలి. ఈపీఎఫ్ మెంబర్, వారి కొడుకు లేదా కూతురు, వారి సోదరుడు లేదా సోదరి పెళ్లి కోసం డబ్బులు డ్రా చేయొచ్చు. ఉన్నత చదువుల కోసం డబ్బులు డ్రా చేయాలన్నా ఇదే నియమం వర్తిస్తుంది.
4. House: కొత్త ఇంటి నిర్మాణం లేదా ఇంటి కొనుగోలు కోసం మీరు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు. అయితే ఈ విత్‌డ్రాయల్‌కు మీరు అర్హత పొందాలంటే, ఈపీఎఫ్‌లో ఐదేళ్ల సభ్యత్వాన్ని పూర్తి చేసి ఉండాలి. ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినందుకు నెలవారీ జీతం కంటే 24 రెట్లు, ఇల్లు కొనుగోలు చేసేందుకు నెలవారీ జీతం కంటే 36 రెట్లు డ్రా చేయొచ్చు. ఇంటి నిర్మాణానికి కూడా 36 రెట్లు వస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ మాత్రమే కాదు వారి జీవిత భాగస్వామి ప్లాట్, ఇల్లు కొంటున్నా డబ్బులు డ్రా చేయొచ్చు. ఇంటి పునర్నిర్మాణానికి నెలవారీ జీతం కంటే 12 రెట్లు డ్రా చేయొచ్చు.
5. Medical: ఆస్పత్రి ఖర్చుల కోసం మీరు ఎప్పుడైనా ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేయొచ్చు. విత్‌డ్రా చేయగల గరిష్ట మొత్తం ఉద్యోగి వాటా వడ్డీతో సహా లేదా అతని నెలవారీ జీతానికి ఆరు రెట్లు సమానం. వీటిలో ఏది తక్కువైతే అదే వర్తిస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్, వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల వైద్య చికిత్స కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.
6. Retirement: ఉద్యోగి మరో ఏడాదిలో రిటైర్ అవుతున్నారంటే పీఎఫ్ ఖాతా నుంచి 90 శాతం డబ్బులు డ్రా చేయొచ్చు. రిటైర్మెంట్‌కు ఏడాది లోపే ఇది వర్తిస్తుంది. (
Thanks for reading EPF Withdrawal: How much can be withdrawn from EPF account for marriage and new house? Find out.
No comments:
Post a Comment