Rain Alert: మీ ఊళ్లో భారీ వర్షం పడొచ్చా? మీ ఫోన్‌లోనే తెలుసుకోండి ఇలా
దేశంలో పలు చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది.
వర్షాలు కురుస్తుంటే బయటకు వెళ్లడం కష్టం. అలాగని పనులమీద బయటకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నా, తప్పనిపరిస్థితుల్లో బయట అడుగు పెట్టక తప్పదు. అయితే మీరు ఉంటున్న ప్రాంతంలో ఇవాళ వర్షం కురుస్తుందా? లేదా? రేపు వాతావరణం ఎలా ఉండబోతోంది? అన్న వివరాలను మీరు స్వయంగా మీ స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకోవచ్చు. టెక్నాలజీతో ఇది చాలా సింపుల్ అయిపోయింది. మరి మీ స్మార్ట్‌ఫోన్‌లో వాతావరణానికి సంబంధించిన అలర్ట్స్ ఎలా పొందాలో తెలుసుకోండి.
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సెట్టింగ్స్
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారు చేసే కంపెనీలన్నీ సొంతగా వెదర్ యాప్స్ అందిస్తుంటాయి. అయితే ఈ బిల్ట్ ఇన్ వెదర్ యాప్స్‌లో వార్నింగ్ ఫీచర్ ఉండకపోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో వెదర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఈ అలర్ట్స్ పొందొచ్చు.
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వెదర్ యాప్ ఓపెన్ చేయాలి.
సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయాలి.
అడ్వాన్స్‌డ్ లేదా మోర్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
Emergency Alerts, Weather Alerts అనే ఆప్షన్స్‌ని ఎనేబుల్ చేయాలి.
ఐఫోన్ యూజర్ల కోసం సెట్టింగ్స్
యాపిల్ ఐఫోన్‌లో బిల్ట్ ఇన్ వెదర్ యాప్ ఉంటుంది. తుఫాన్లు, వరదల్లాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు సంబంధించి నోటిఫికేషన్స్ పొందొచ్చు. ఈ సెట్టింగ్స్ ఎనేబుల్ చేస్తే వాతావరణం సరిగ్గా లేనప్పుడు వెంటనే మీకు అలర్ట్స్ వస్తాయి. మరి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు సంబంధించి మీ ఐఫోన్‌లో నోటిఫికేషన్స్ పొందడానికి ఈ సెట్టింగ్స్ మార్చండి.
ముందుగా మీ ఐఫోన్‌లో వెదర్ యాప్ ఓపెన్ చేయాలి.
లోయర్ రైట్ కార్నర్‌లో లిస్ట్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
అడిషనల్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయాలి.
Severe Weather ఆప్షన్ ఆన్ చేయాలి.
ఈ సెట్టింగ్స్‌తో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్లకు వైబ్రేషన్, అలర్ట్ టోన్ కూడా ఆన్ చేయొచ్చు. ఐఫోన్ వెదర్ యాప్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటు రాబోయే కొన్ని గంటల్లో, రోజుల్లో వాతావరణ ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకోవచ్చు.
ఇక మీరు గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తున్నట్టైతే
అందులో crisis-related alerts అనే ఫీచర్ ఉంటుంది. ఈ అలర్ట్స్ ఆన్ చేస్తే మీ ప్రాంతంలో వాతావరణం వల్ల ముప్పు కలిగే ముందు అలర్ట్ వస్తుంది. భూకంపాలు, వరదలు, తుఫాన్ల లాంటి వాటి అలర్ట్స్ మీ ఫోన్‌లో వస్తాయి. ఈ అలర్ట్స్‌తో మీరు ముందుగానే అప్రమత్తం కావొచ్చు.
Thanks for reading Heavy rain in your town? Find out on your phone
No comments:
Post a Comment