ఏపీ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే..

CM jagan: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్5 జోన్‌లో 47 వేల ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు - మూలపేట పోర్టు నిర్మాణం కోసం రూ.3,880 కోట్లు రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
వేంపల్లి వద్ద జిందాల్ న్యూఎనర్జీకి 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదంటిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించడానికి మంత్రివర్గం ఆమోదంవిక్రయంతోపాటు హడ్కో నుంచి రూ.750 కోట్లు రుణం ప్రతిపాదనకు ఆమోదంగండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.454 కోట్లు పరిహార ప్యాకేజీకి ఆమోదంరాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన ప్రాజెక్టులకు ఆమోదం
కేబినెట్ ఆమోదించిన మరికొన్ని అంశాలు..
భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూముల కేటాయింపునకు ఆమోదం.
అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంపెడ్ స్తోరేజీ ప్రాజెక్టుకి ఆమోదం.
టిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించడంతో పాటు హడ్కో నుంచి రూ.750 కోట్లు రుణంగా తీసుకునే ప్రతిపాదనకు అనుమతి.
గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.454 కోట్ల పరిహారం ప్యాకేజీ మంజూరుకు ఆమోదం తెలిపింది.
Thanks for reading Highlights of the AP Cabinet meeting @ 12.07.23
No comments:
Post a Comment