India Security Press Recruitment
సెక్యూరిటీ ప్రెస్‌లో 108 కొలువులు
‣ అర్హత: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ
నాసిక్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ఐఎస్‌పీ) 108 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి పోటీపడితే ఐటీఐ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
1925లో ఏర్పాటుచేసిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లో పాస్‌పోర్ట్‌లు, ఇతర ప్రయాణ డాక్యుమెంట్లు, పోస్టేజ్ స్టాంపులు, పోస్ట్‌కార్డులు, ఇన్‌లాండ్ లెటర్లు, ఎన్వలప్‌లు, నాన్‌జ్యుడీషియల్, రెవెన్యు స్టాంపులు మొదలైనవి ముద్రిస్తారు. తాజా నోటిఫికేషన్‌లో టెక్నికల్, స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో 108 ఖాళీలు ఉన్నాయి. వెల్ఫేర్ ఆఫీసర్-1, జూనియర్ టెక్నీషియన్ (టెక్నికల్)-41, కంట్రోల్-41, స్టూడియో-04, స్టోర్-04, సీఎస్‌డీ-05, టర్నర్-01, మెషినిస్ట్ గ్రైండర్-01, వెల్డర్-01, ఫిట్టర్-04, ఎలక్ట్రీషియన్-02, ఎలక్ట్రానిక్-03.. ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
1) వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ పాసై.. మరాఠీ భాష తెలిసి ఉండాలి. ఏదైనా సంస్థ/ పరిశ్రమలో వెల్ఫేర్ ఆఫీసర్/ పర్సనల్ ఆఫీసర్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్ల ఉద్యోగానునుభవం ఉండాలి. వయసు 31.07.2023 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి. నెలకు వేతన శ్రేణి రూ.29,740-రూ.1,03,000.
2) జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఫుల్‌టైమ్ ఐటీఐ సర్టిఫికెట్/ ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. వయసు 31.07.2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. వేతన శ్రేణి నెలకు రూ.18,780-67,390. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్ట్థీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. హారిజాంటల్ రిజర్వేషన్ కింద.. పీడబ్ల్యూడీలకు 4, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 10 పోస్టులను కేటాయించారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2023
వెబ్‌సైట్: https://ispnasik.spmcil.com/en/
Thanks for reading India Security Press Recruitment
No comments:
Post a Comment