SBI PPF account: Want to open a PPF account online with SBI? But these details are for you
SBIలో PPF ఖాతా.. ఆన్‌లైన్‌లో సులువుగా ఇలా తెరవండి..
SBI PPF account: ఎస్‌బీఐలో పీపీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్‌లో తెరవాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే
అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పీపీఎఫ్ (ప్రజా భవిష్యనిధి) ఒకటి. దీని కాలవ్యవధి 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఖాతాను కొనసాగించాలనుకుంటే 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి అందిస్తున్న పథకం ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో పీపీఎఫ్ ఖాతాను తెరవాలనుకుంటున్నారా? దీని కోసం బ్యాంక్‌కే వెళ్లాల్సిన పనిలేదు. కేవలం ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ సాయంతో అకౌంట్ ఓపెన్ చేయచ్చు. దీని కోసం మీ ఆధార్ కార్డ్ నంబర్‌కు ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాను కచ్చితంగా లింక్ చేసుండాలి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుండాలి. ఫోన్‌నంబర్‌కు ఓటీపీ యాక్టివేషన్ కూడా ఉండాలి. ఇవి ఉంటే చాలు సులువుగా పీపీఎఫ్ ఖాతా తెరిచేయచ్చు.
ఖాతా తెరవండిలా..
దీని కోసం ఈ www.onlinesbi.com లింక్ ద్వారా ఎస్‌బీఐ ఆన్‌లైన్ అకౌంట్‌లో లాగిన్ అవ్వచ్చు.
లాగిన్ అయిన తర్వాత కుడివైపు పైనున్న "request and enquiries" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అందులోని డ్రాప్‌డౌన్ మెనూలో "New PPF Accounts" లింక్‌ను ఎంచుకోవాలి.
అందులో మీ పేరు, చిరునామా, పాన్‌కార్డ్, సీఐఎఫ్ నంబర్ స్క్రీన్‌పై చూపిస్తుంది.
ఒక వేళ మైనర్ తరపున ఖాతా తెరుస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న బాక్స్‌లో టిక్ చేయాలి.
మైనర్ కాకపోతే మీరు ఏ బ్రాంచ్‌లో పీపీఎఫ్ ఖాతా తెరవాలనుకుంటే సదరు బ్రాంచ్ పేరు, కోడ్‌ను ఎంటర్ చేయాలి.
దాంతో పాటు కనీసం ఐదుగురి నామినీల వివరాలు అందులో పొందుపరచాలి.
వివరాలన్ని ఎంటర్ చేశాక "Submit" ఆప్షన్ ఎంచుకోగానే, కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులో కన్‌ఫాం చేశాక, మీ రిఫరెన్స్ నంబర్‌ను తెలుపుతుంది.
రిఫరెన్స్ నంబర్‌ను గుర్తుంచుకోవాలి. "Print PPF Online Application" ఆప్షన్‌ను క్లిక్ చేసి మీ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మీ ఫొటోలు, KYC డాక్యుమెంట్స్‌తోపాటు మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంతోను 30 రోజుల్లోగా మీ దగ్గరలోని బ్రాంచ్‌లో సబ్మిట్ చేయాలి.
Thanks for reading SBI PPF account: Want to open a PPF account online with SBI? But these details are for you
No comments:
Post a Comment