APPSC: త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు
* వదంతులు నమ్మొద్దని ఏపీపీఎస్సీ ఛైర్మన్ సూచన
అమరావతి: త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సెప్టెంబరులోపు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. గ్రూప్-1 కింద 100, గ్రూప్-2 కింద 1000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అలాగే గ్రూప్స్ పరీక్షల సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ ఉంటుందన్నారు. అయితే, ఉద్యోగాల నియామకాలపై వదంతులు నమ్మొద్దని గౌతమ్ సవాంగ్ అభ్యర్థులకు సూచించారు.
Thanks for reading Appsc: Group-1, Group-2 notifications coming soon
No comments:
Post a Comment