APSRTC Apprentice Recruitment 2023 – Apply Online for Apprentice Posts
ఏపీఎస్‌ఆర్‌టీసీ- విజయనగరం జోన్‌లో అప్రెంటిస్ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), విజయనగరం జోన్... కింది ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 15లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 18, 19, 21 తేదీల్లో విజయనగరంలోని ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
విజయనగరం జోన్ పరిధిలోని జిల్లాలు: తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, మన్యం పార్వతీపురం, శ్రీకాకుళం.
ఖాళీల వివరాలు:
అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్
ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ వర్కర్, మిల్ రైట్ మెకానిక్.
అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-08-2023
తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 18-08-2023
విశాఖపట్నం, అనకాపల్లి, సీతారామరాజు జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 19-08-2023
శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 21-08-2023
ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, వీటీ అగ్రహారం, విజయనగరం.
Thanks for reading APSRTC Apprentice Recruitment 2023 – Apply Online for Apprentice Posts
No comments:
Post a Comment