Chandrayaan-3 Mission Soft-landing LIVE Telecast
🛰️విక్రమ్ ల్యాండింగ్‌కు టైం ఫిక్స్
♦️23న సాయంత్రం 6:04 గంటలకు ల్యాండింగ్
♦️జాబిల్లికి అడుగు దూరంలో ల్యాండర్
♦️సూర్యోదయం కోసం ఇస్రో ఎదురుచూపులు
ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు ఇస్రో టైం ఫిక్స్ చేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండర్ మాడ్యూల్‌కు చివరి దశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో.. ఈ నెల 23న సాయంత్రం 6:04 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగుతుందని ఆదివారం వెల్లడించింది. 23న సాయంత్రం 5:45 గంటలకు ల్యాండింగ్ ఉంటుందని గతంలో ఇస్రో ప్రకటించింది. కానీ, ఇప్పుడు ఆ సమయాన్ని ముందుకు జరిపారు. బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్‌కు రెండో దశ డీబూస్టింగ్ ఆపరేషన్ చేపట్టి దాన్ని దిగువ కక్ష్యకు విజయవంతంగా చేర్చారు. ఇక ల్యాండర్ జాబిల్లిపై కాలుమోపడమే తరువాయి. ప్రస్తుతం ఇది చంద్రుడికి 25 కిలోమీటర్ల దగ్గరగా.. 134 కిలోమీటర్ల దూరంగా ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపనుందని ఇస్రో ట్విటర్‌లో పేర్కొంది. అయితే ప్రస్తుత కక్ష్యలో ల్యాండర్ మాడ్యూల్‌కు అంతర్గత తనిఖీలు చేపట్టాల్సి ఉందని తెలిపింది. అలాగే ఎంచుకున్న ల్యాండింగ్ ప్రదేశంలో సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపింది. ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇస్రో పేర్కొంది. ఇస్రో వెబ్‌సైట్, ఫేస్‌బుక్ పేజ్, యూట్యూబ్ చానెల్‌తోపాటు డీడీ నేషనల్ చానెల్‌లోనూ ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అనేది ఒక చారిత్రక ఘట్టమని, సర్వత్రా ఇది ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా యువతలో అన్వేషణపై మక్కువ పెంచుతుందని ఇస్రో తెలిపింది.
Chandrayaan-3 Mission Soft-landing LIVE Telecast
Thanks for reading Chandrayaan-3 Mission Soft-landing LIVE Telecast
No comments:
Post a Comment