TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 1, 2023

IBPS SO 2023 Notification (Out) for 1402 Posts | Eligibility, Application Form


 IBPS SO 2023 Notification (Out) for 1402 Posts | Eligibility, Application Form

IBPS Jobs: ప్రభుత్వ బ్యాంకుల్లో 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్‌)… వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్‌-XIII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్‌ సింధ్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

వివరాలు:

1. ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 120 పోస్టులు

2. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్-1): 500 పోస్టులు

3. రాజ్‌భాష అధికారి (స్కేల్-1): 41 పోస్టులు

4. లా ఆఫీసర్ (స్కేల్-1): 10 పోస్టులు

5. హెచ్ఆర్‌/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 31 పోస్టులు

6. మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1): 700 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,402.

అర్హతలు: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్). డిగ్రీ (అగ్రికల్చర్‌/ హార్టికల్చర్/ యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ సైన్స్/ ఫిషరీ సైన్స్/ పిసి కల్చర్/ అగ్రి. మార్కెటింగ్ అండ్‌ కోఆపరేషన్/ కో-ఆపరేషన్ అండ్‌ బ్యాంకింగ్/ ఆగ్రో-ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్/ అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్ / డెయిరీ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ సెరికల్చర్/ ఫిషరీస్ ఇంజినీరింగ్). పీజీ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్). పీజీ (హిందీ/ సంస్కృతం). డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ), పీజీ డిప్లొమా(పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హెచ్‌ఆర్‌/ హెచ్‌ఆర్‌డీ/ సోషల్ వర్క్/ లేబర్ లా). ఎంఎంఎస్‌(మార్కెటింగ్)/ ఎంబీఏ(మార్కెటింగ్)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం. 

వయోపరిమితి: 01.08.2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లో మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు:  విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2023.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2023.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 30.12.2023/ 31.12.2023.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2024.

ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్:  జనవరి, 2024.

ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 28.01.2024.

తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2024.

ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: ఫిబ్రవరి/ మార్చి 2024.

ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2024.

ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2024.

Website Here

Notification Here

Thanks for reading IBPS SO 2023 Notification (Out) for 1402 Posts | Eligibility, Application Form

No comments:

Post a Comment