LPG cylinder: ఎల్పీజీ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. సిలిండర్‌పై రూ.200 తగ్గింపు
LPG price cut: వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ ధర రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.200 చొప్పున తగ్గించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారుక. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే, ఉజ్వల పథకం కింద 75 లక్షల కొత్త వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇంట్లో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో రూ.1103గా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను మాత్రం స్థిరంగా ఉంచుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచారు. 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం కింద 5 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చారు.
Thanks for reading LPG cylinder: Good news for LPG users.. Rs.200 discount on cylinder
No comments:
Post a Comment