Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 12, 2023

Best Central Government Schemes For Girls


 Best Central Government Schemes For Girls: ఆడపిల్లల కోసం.. 5 బెస్ట్ ప్రభుత్వ పథకాలు!

Best Central Government Schemes For Girls: ఏ తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరుకుంటారు. అందుకోసం కష్టపడతారు. ఇక ఆడపిల్లల విషయంలో మరింత జాగ్రత్త పడతారు.

చదువు, పెళ్లి విషయం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఆలోచిస్తారు. అయితే ఆడపిల్లల కోసమే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అందులో 5 అత్యుత్తమ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Best Central Government Schemes For Girls: ఇంట్లో ఆడపిల్ల ఉందంటే.. ఆ తల్లిదండ్రులు ముందు నుంచే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. చదువు నుంచి పెళ్లి దాకా పక్కా ప్లాన్ వేస్తుంటారు. అయితే.. ఆర్థికంగా అందరికీ ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే.. కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ది బెస్ట్ అనిపించే 5 పథకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1. బాలికా సమృద్ధి యోజన

Balika Samridhi Yojana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) నివసిస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా బాలికా సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతీ కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు కుమార్తెల కోసం ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద బాలికల విద్య కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. ఈ పథకం ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి వారి చదువు (పదో తరగతి) వరకూ ఆర్థిక సాయం అందిస్తోంది.

బాలికా సమృద్ధి యోజనకు దరఖాస్తు చేయడానికి.. జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల అడ్రస్​, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్​, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్.

దరఖాస్తును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు.

ఆఫ్‌లైన్ దరఖాస్తులను అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సేవా కేంద్రాల నుంచి పొందవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తులకు ఎలక్ట్రానిక్ రూపంలో ఫారమ్‌ను పూరించి సమర్పించాలి.

గ్రామీణ, పట్టణ లబ్ధిదారుల కోసం వేర్వేరు ఫారమ్‌లు ఉంటాయి.

ఈ పథకం కింద దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి కొన్ని నియమించబడిన బ్యాంకులు మాత్రమే అనుమతించబడతాయి. ఆ బ్యాంకుల్లో ఖాతా తెరవవచ్చు.

ఆడపిల్ల పుట్టినప్పుడు, ఆర్థిక సాయంగా.. రూ. 500 ఈ పథకం కింద తల్లిదండ్రులకు అందజేస్తారు.

ఒకటో తరగతి నుంచి మూడో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి 300 ఇస్తారు. దీన్ని క్రమక్రమంగా పెంచుతూ తొమ్మిది, పదో తరగతి వచ్చేసరికి రూ.1000 సాయం చేస్తారు.

2. బేటీ బచావో బేటీ పడావో:

Beti Bachao Beti Padhao: భారతదేశంలోని బాలికలను అబార్షన్ నుంచి రక్షించడంతోపాటు వారు విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం మొదట దేశంలోని లింగ నిష్పత్తి చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. ఇది ప్రధానంగా ఆడపిల్లల కోసం ఉద్దేశించిన విద్యా కార్యక్రమం కాబట్టి తల్లిదండ్రులకు ఎలాంటి ఫండ్ బదిలీ ఉండదు.

బేటీ బచావో బేటీ పఢావో పథకం ముఖ్య లక్షణాలు:

దేశ విద్యా వ్యవస్థలో ఆడపిల్లల చేరికను నిర్ధారించడం

ఆస్తి వారసత్వంలో ఆడపిల్లల సమాన హక్కును ప్రోత్సహించడం

దేశంలో లింగ ఆధారిత అబార్షన్‌ను నిరోధించడం

భారతదేశంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం

3. CBSE ఉడాన్ పథకం :

CBSE Udaan Scheme: UDAN అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ప్రాజెక్ట్. పాఠశాల విద్య, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల మధ్య అంతరాన్ని తగ్గించడానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) ఈ పథకాన్ని ప్రారంభించింది. 10వ తరగతిలో కనీసం 70% మార్కులు, సైన్స్ అండ్​ మ్యాథ్స్‌లో 80% మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. www.cbse.nic.in లేదా www.cbseacademic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్​లో గణితం, భౌతిక శాస్త్రం లేదా రసాయన శాస్త్రాలలో చదువుతున్న CBSE- అనుబంధ పాఠశాలల బాలికల విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

పథకం కోసం ఆడపిల్లల ఎంపిక ఖచ్చితంగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.

బాలికలు భారతదేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులు అయి ఉండాలి.

విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా రూ. 6 లక్షలు లేదా అంతకంటే తక్కువుగా ఉండాలి.

4. ముఖ్యమంత్రి కన్యా సురక్ష యోజన:

Mukhyamantri Kanya Suraksha Yojana: భారతదేశంలోని ఆడపిల్లల తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీహార్​ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులకు 2000 రూపాయలను.. అందిస్తుంది. పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని అందించిన తర్వాత ఈ బహుమతిని పొందవచ్చు.

పథకం కోసం అర్హత ప్రమాణాలు..

బీహార్‌లోని శాశ్వత నివాసితులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు అర్హులు

దరఖాస్తుదారు గ్రామ పంచాయతీ లేదా జిల్లా పరిషత్ లేదా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా రివార్డ్‌ను పొందవచ్చు.

సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తుదారుని దారిద్య్ర రేఖకు దిగువగా ఉండాలి.

5. సుకన్య సమృద్ధి యోజన:

Sukanya Samriddhi Yojana: భారత ప్రభుత్వం అందిస్తున్న పాపులర్ పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన ముందువరుసలో ఉంటుంది. ఇది ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులు ముందు నుంచే సేవింగ్స్ చేసుకోవాలని చెప్పే స్కీం. చిన్న వయసు నుంచే అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కల్లా పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందుతాయి. ఇక ఈ స్కీం గురించి మనం తెలుసుకుందాం.

అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?

సుకన్య సమృద్ధి అకౌంట్‌ను పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో తెరవొచ్చు. బర్త్ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లి.. బ్యాంక్‌లో ఒక ఫారమ్​ నింపి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అన్నీ పరిశీలించిన తర్వాత అకౌంట్ ఓపెన్​ చేస్తారు.

ఈ అకౌంట్ కోసం కనీసం రూ.250 డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఏడాదికి కనీసం రూ.250 ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా రూ. 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

ఇంట్లో ఆడపిల్ల పేరు మీదు అకౌంట్ తెరవాలి. గరిష్టంగా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల పేరు మీద తెరవొచ్చు. ఒక్కో చిన్నారికి ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. పాపకు పదేళ్లు వచ్చే వరకు ఈ అకౌంట్ తెరిచేందుకు అర్హులు.

అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వరుసగా 15 ఏళ్ల పాటు డబ్బులు కడుతుండాలి.

ఇక సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 21 సంవత్సరాలు. అంటే అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఏళ్ల తర్వాత మొత్తం డబ్బులు చేతికొస్తాయి.

పాపకు పదేళ్లు వచ్చిన తర్వాత తనే అకౌంట్ నిర్వహించుకోవచ్చు. ఇక పాపకు 18 ఏళ్లు వస్తే.. డబ్బులు 50 శాతం విత్‌డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.

ఇక ఏడాదికి కనీసం రూ.250 అయినా.. ఏడాదికి కొంచెం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. నెలకు రూ. 2, 3, 5, 10వేల రూపాయల చొప్పున కట్టుకోవచ్చు.

Thanks for reading Best Central Government Schemes For Girls

No comments:

Post a Comment