Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, September 4, 2023

LIC Jeevan Kiran policy: Financial security for the family on one side with a single policy.. Savings on the other!


 LIC Jeevan Kiran policy: ఒకే పాలసీతో ఓవైపు కుటుంబానికి ఆర్థిక భరోసా.. మరోవైపు పొదుపు!

 భారతీయ జీవిత బీమా (LIC) సంస్థ ఇటీవల జీవన్‌ కిరణ్‌ (LIC Jeevan Kiran) పేరిట ఓ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇది నాన్‌-పార్టిసిపేటివ్‌, నాన్‌- లింక్డ్‌ పథకం.

అంటే హామీ మొత్తం, ప్రయోజనాల విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. ఇది కుటుంబానికి రక్షణతో పాటు పొదుపు సాధనంగానూ పనిచేస్తుంది. పాలసీదారుడి అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబానికి నిర్దిష్ట హామీ మొత్తం అందుతుంది. ఒకవేళ పాలసీ (LIC Jeevan Kiran) కాలపరిమితి ముగిసే వరకు పాలసీదారుడు ఉంటే.. మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ను అందిస్తారు. దీన్ని ఏజెంట్లు, ఎల్‌ఐసీ కార్యాలయాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.

ప్రధాన ఫీచర్లు..

ఎల్‌ఐసీ జీవన్‌ కిరణ్‌ (LIC Jeevan Kiran) కుటుంబానికి ఆర్థిక రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి హామీ మొత్తం లభిస్తుంది. అలాగే కాలపరిమితి ముగిసే వరకు జీవించి ఉంటే.. మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ అందుతాయి.

ఎల్‌ఐసీకి వచ్చే లాభాల్లో నుంచి పాలసీదారులకు ప్రయోజనాలను ఇస్తారు. బోనస్‌ల రూపంలో ఇవి అందుతాయి. ఈ నేపథ్యంలో కనీస హామీ మొత్తంతో పాటు అదనపు డబ్బు కూడా అందుతుంది.

ప్రీమియం చెల్లించడానికి పాలసీదారుడిని కాలపరిమితి విషయంలో వెసులుబాటు ఉంటుంది. వార్షిక, ఆరు నెలలు, మూడు నెలలు, నెల.. ఇలా వీలును బట్టి ప్రీమియం చెల్లించొచ్చు.

ప్రీమియం విలువ ఒక నిర్దిష్ట మొత్తం దాటిన తర్వాత పాలసీని సరెండర్‌ చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. కొన్ని నిబంధనలకు లోబడి సరెండర్‌ విలువ మొత్తాన్ని అందిస్తారు.

అత్యవసరంగా డబ్బులు అవసరమైన సమయంలో ఈ పాలసీ (LIC Jeevan Kiran)ని తనఖాగా వాడుకొని రుణం కూడా పొందొచ్చు.

జీవన్‌ కిరణ్‌ పాలసీకి కావాల్సిన అర్హతలు..

ప్రయోజనాలు..

అకాల మరణం సంభవిస్తే..

ఒకవేళ పాలసీదారుడు ప్రమాదవశాత్తు పాలసీ కాలపరిమితి ముగిసే లోపే మరణిస్తే.. నామినీ కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుంది. కనీస హామీ మొత్తాన్ని కుటుంబానికి అందజేస్తారు. అలాగే బోనస్‌లు, ఇతర ప్రయోజనాలేమైనా ఉన్నా వర్తింపజేస్తారు.

కనీస హామీ మొత్తం కింది వాటిలో ఏది అధికంగా ఉంటే అది..

రెగ్యులర్‌ ప్రీమియం పేమెంట్‌ ఎంచుకున్నవారికి..

వార్షిక ప్రీమియం మొత్తానికి ఏడు రెట్లు

మరణించే నాటికి చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం

పాలసీలో పేర్కొన్న కనీస హామీ మొత్తం

ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించిన వారికి..

చెల్లించిన ఏక మొత్తం ప్రీమియంలో 125%

పాలసీలో పేర్కొన్న కనీస హామీ మొత్తం

మెచ్యూరిటీ ప్రయోజనాలు..

ఒకవేళ పాలసీ కాలపరిమితి ముగిసే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే.. మెచ్యూరిటీ ప్రయోజాలు అందుతాయి. గడువు ముగిసే నాటికి చెల్లించిన ప్రీమియంల మొత్తం చేతికి అందుతుంది. సింగిల్‌ ప్రీమియం పేమెంట్‌ పాలసీకీ ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఆ సమయానికి ఎల్‌ఐసీ ఏమైనా ప్రత్యేకంగా బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు ప్రకటించి ఉంటే వాటిని కూడా అందజేస్తారు.

పన్ను ప్రయోజనాలు..

ఎల్‌ఐసీ జీవన్‌ కిరణ్‌ పాలసీకి చెల్లించిన ప్రీమియంలకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.

ఇతర రైడర్లు..

జీవన్‌ కిరణ్‌ బేస్‌ పాలసీకి అదనంగా రైడర్లను కూడా జత చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ప్రమాద బీమాను కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి పాలసీదారుడికి మరణిస్తే వారి కుటుంబానికి అదనపు హామీ మొత్తం అందజేస్తారు. అంగవైకల్యం సంభవించినా.. నిర్దిష్ట హామీ మొత్తాన్ని ఇస్తారు.




Thanks for reading LIC Jeevan Kiran policy: Financial security for the family on one side with a single policy.. Savings on the other!

No comments:

Post a Comment