Personal Loan: రుణం తీసుకున్న వాళ్లు మరణిస్తే దాన్ని చెల్లించే బాధ్యత వారిదేనా? నిబంధనలు తెలిస్తే షాకవుతారు..
పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుత రోజుల్లో రుణం తీసుకోవడం అనేది తప్పనిసరి పరిస్థితిగా మారింది. వ్యక్తిగత అవసరాలకు తీసుకునే వ్యక్తిగత రుణం, లేకపోతే కారు కొనుగోలుకు తీసుకునే వాహన రుణం, ఇంటి నిర్మాణం కోసం తీసుకునే ఇంటి రుణం ఇలా ఏదైనా ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో రుణం తీసుకుంటున్నారు.
దానిని ప్రతి నెలా సులభ వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. అయితే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ రుణం ఎవరు చెల్లించాలి? అనే అనుమానం అందరికీ వస్తుంది. ముఖ్యంగా పెరిగిన సౌకర్యాల నేపథ్యంలో రుణం పొందడం సులభంగా మారింది. ముఖ్యంగా పర్సనల్ లోన్ పొందడం అనేది తక్షణ డబ్బు అవసరమయ్యే పరిస్థితులను తగ్గించడంలో సహాయపడుతుంది. డిజిటల్ అప్లికేషన్, అప్రూవల్ ప్రాసెస్‌ల సులభతరంగా మారడంతో సాధారణంగా పర్సనల్ లోన్ పొందడానికి ఎక్కువ సమయం కూడా పట్టడంలేదు. వ్యక్తిగత రుణాన్ని పొందుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అనేక అంశాలు ఉన్నప్పటికీ రుణం తీసుకునే కాలంలో రుణగ్రహీత మరణిస్తే రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత తరచుగా విస్మరిస్తూ ఉంటారు. ఈ తరుణంలో అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు రుణాలను ఎవరు చెల్లించాలి? నిబంధనలు ఏం చెబుతున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
రుణగ్రహీత మరణిస్తే వ్యక్తిగత రుణం ఎవరు చెల్లించాలి?
వ్యక్తిగత రుణాలు సాధారణంగా అసురక్షితంగా ఉంటాయి. అందువల్ల, రుణగ్రహీత మరణిస్తే రుణదాత రుణ మొత్తాన్ని రికవరీ చేయడంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రుణగ్రహీత మరణించిన తర్వాత రుణదాత రుణ గ్రహీత ఆస్తుల నుంచి చెల్లించని మొత్తాన్ని తిరిగి పొందే ప్రక్రియను ప్రారంభించవచ్చు. అలాంటి సందర్భాల్లో బకాయిలను రికవరీ చేయడానికి బ్యాంక్ చట్టబద్ధమైన వారసుడిని కూడా సంప్రదించవచ్చు.అయితే చట్టబద్ధంగా వ్యక్తిగత రుణం తీసుకున్న రుణగ్రహీత దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో రుణదాత చట్టపరమైన వారసుడిని లేదా మరణించిన రుణగ్రహీత కుటుంబంలోని మిగిలిన సభ్యులను మిగిలిన మొత్తాన్ని చెల్లించమని బలవంతం చేయలేరు. అంతేకాకుండా వ్యక్తిగత రుణాలు అసురక్షితమైనవి మరియు ఈ లోన్‌లను పొందేందుకు ఎలాంటి పూచీకత్తు లేదా హామీదారు అవసరం లేదు కాబట్టి ఏ గ్యారంటర్ ఈ పరిధిలోకి రారు. అదనంగా రుణం అసురక్షితమైనది కాబట్టి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేయడం కోసం రుణదాత రుణగ్రహీత ఆస్తిని స్వాధీనం చేసుకోలేరు లేదా విక్రయించలేరు. పర్సనల్ లోన్ రీపేమెంట్ సాధ్యం కానందున ఈ మొత్తం చివరికి రద్దు చేస్తారు. అలాగే వీటిని నిరర్ధక ఆస్తులు ఖాతాకు బదిలీ చేస్తారు.
వ్యక్తిగత రుణాలపై బీమా పాలసీలు
ఈ రోజుల్లో చాలా వరకు అసురక్షిత వ్యక్తిగత రుణాలు ప్రాథమిక రుణగ్రహీత కోసం బీమా చేస్తున్నారు. ఈ బీమా పాలసీలు మిగిలిన రుణ మొత్తాన్ని కవర్ చేస్తాయి. తిరిగి చెల్లించే వ్యవధిలో చెల్లుబాటు అవుతాయి. రుణదాత నష్టాలను ఆదా చేస్తాయి. సాధారణంగా పర్సనల్ లోన్ పొందే సమయంలో రుణగ్రహీత అటువంటి బీమా పాలసీల ప్రీమియం కోసం చెల్లించాల్సి ఉంటుంది. ఇది రుణగ్రహీతకు అంతగా అనుకూలించని ఎంపిక కావచ్చు. కానీ రుణగ్రహీత మరణించిన సందర్భంలో రుణదాత మిగిలిన రుణ మొత్తాన్ని కోల్పోనవసరం లేదు. కాబట్టి రుణదాతకు కవర్‌గా ఉపయోగపడుతుంది.
Thanks for reading Personal Loan: Are the borrowers responsible for paying the loan if they die? You will be shocked if you know the rules.
No comments:
Post a Comment