WhatsApp Restore : మీ ఫోన్ పోగొట్టుకున్నారా?.. ఈ సింపుల్ టిప్స్‌తో వాట్సాప్ అకౌంట్‌ను రీస్టోర్ చేసుకోండి!
WhatsApp Restore Account : మీ ఫోన్ పోయిందా? దీనితో పాటు మీ వాట్సాప్ కాంటాక్ట్స్, పర్సనల్ మెసేజెస్ అన్నీ పోయాయని బాధపడుతున్నారా? చింతించకండి.
6 సింపుల్ టిప్స్‌తో మీ వాట్సాప్ అకౌంట్‌ను తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
WhatsApp Restore Account : వాట్సాప్.. విశేష జనాదరణ కలిగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం. ఏ చిన్న పని చక్కబెట్టాలన్నా ప్రస్తుతం దీన్నే చాలామంది విరివిగా వాడుతున్నారు. అయితే ఒక్కోసారి టైం బాగోక మన ఫోన్ అపహరణకు గురవుతుంటుంది. లేదా మనమే పోగొట్టుకుంటూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో అందులోని విలువైన సమాచారం.. ఫోన్ నంబర్లు, సందేశాలతో పాటు ఇతర ముఖ్యమైన వ్యక్తిగతమైన వివరాలను కూడా కోల్పోతాము. ముఖ్యంగా ఇతరుల చేతుల్లోకి మన డేటా వెళ్లిపోతుంది. దీనితో మన ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో వాట్సాప్‌లో చేసిన పర్సనల్ చాట్స్ అన్నీ బహిర్గతం అయ్యే ప్రమాదం ఉంటుంది. మరి ఇలా జరగకుండా ఉండాలంటే.. 6 సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. దీనితో మీ వాట్సాప్ అకౌంట్( WhatsApp Restore Messages )ను తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా పునరుద్ధరించుకొని, సురక్షితంగా ఉంచుకోవచ్చు.
1. చాట్ హిస్టరీ బ్యాకప్ మేలు!
WhatsApp Restore With Backup : మన ఫోన్ ఎప్పుడు, ఎక్కడ అపహరణకు గురవుతుందో చెప్పలేము. అలాంటప్పుడు ముందుగానే మన వాట్సాప్ చాట్ హిస్టరీని బ్యాకప్ చేసుకొని ఉంచుకోవడం మేలు. దీనితో మీరు కొత్త ఫోన్లో లేదా పాత మొబైల్లో కూడా మీ వాట్సాప్ అకౌంట్‌ను రీస్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఓల్డ్ చాట్ హిస్టరీని కూడా రికవరీ చేసుకోవచ్చు.
మీ చాట్ హిస్టరీని బ్యాకప్ చేయడానికి ముందుగా.. వాట్సాప్ సెట్టింగ్స్> చాట్స్> చాట్ బ్యాకప్> చివరగా బ్యాకప్ బటన్‌పై ట్యాప్ చేయండి. లేదా ఆటోమెటిక్ బ్యాకప్స్‌ను సెటప్ చేయడం ద్వారా కూడా మీ చాట్‌ను గూగుల్ డ్రైవ్ లేదా ఐ-క్లౌడ్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు.
2. వెంటనే అకౌంట్‌ను డీ-యాక్టివేట్ చేయండి..!
మీ ఫోన్ అపహరణకు గురయినప్పుడు లేదా పోగొట్టుకున్నప్పుడు మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది.. వాట్సాప్ అకౌంట్ డీ-యాక్టివేషన్. ఇది మీ వాట్సాప్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేయడానికి వీల్లేకుండా చేస్తుంది.
మీ అకౌంట్‌ను డీ-యాక్టివేట్ చేయడానికి ముందుగా.. వాట్సాప్ సపోర్ట్‌కు మెయిల్ పంపండి. support@whatsapp.com అనే మెయిల్ ఐడీకి "Lost/Stolen: Please deactivate my account" అనే సబ్జెక్ట్ లైన్‌తో ఈ-మెయిల్ పెట్టండి. అయితే ఇలా మెయిల్ పెట్టే సమయంలో బాడీ విభాగంలో మీ ఫోన్ నంబర్‌ను ఇంటర్నేషనల్ ఫార్మాట్లో అంటే +1 555-123-4567 లాంటి సంఖ్యలను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.
3. కొత్త సిమ్ కార్డును తీసుకోండి!
How To Restore WhatsApp Backup : ఒకవేళ మీరు పొగొట్టుకున్న ఫోన్ మరలా దొరికింది అనుకుందాం.. అప్పుడు కూడా పాత నంబర్‌పైనే మరో కొత్త సిమ్ కార్డును తీసుకోండి. దీనితో మీ వాట్సాప్ అకౌంట్‌ను.. చాట్ హిస్టరీని మరలా రిస్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది. లేకపోతే కొత్త సిమ్‌కార్డును వేరే మొబైల్లో వేసి.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. తరువాత మీ ఫోన్ నంబర్‌ను వెరిఫై చేసుకోవడం సహా.. వాట్సాప్ చాట్ హిస్టరీని కూడా రీస్టోర్ చేసుకోండి.
4. చాట్ హిస్టరీని రిస్టోర్ చేయండి!
How To Restore Your WhatsApp Chats : మీరు పోగొట్టుకున్న ఫోన్లో వాట్సాప్ చాట్ హిస్టరీని బ్యాకప్ చేసినట్లయితే.. మీరు సులువుగా కొత్త ఫోన్లో వాటిని రీస్టోర్ చేసుకోవచ్చు. దీనితో మీ పాత చాట్‌లోని ఫొటోలు, వీడియోలు సహా వ్యక్తిగత సందేశాలన్నంటినీ తిరిగి పొందవచ్చు.
5. మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోండి!
భవిష్యత్తులో మీ వాట్సాప్ అకౌంట్‌ను థర్డ్ పార్టీలేవీ యాక్సెస్ చేయడానికి వీల్లేకుండా మీరు కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోండి. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్> అకౌంట్> టూ-స్టెప్ వెరిఫికేషన్‌పై క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు తెలియకుండా మరెవరూ మీ వాట్సాప్‌ను యాక్సెస్ చేయలేరు. ఎవరైనా మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినా.. మీకు మాత్రమే తెలిసిన 6 అంకెల పిన్ నంబర్‌ను వాట్సాప్ అడుగుతుంది.
6. వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్.. జాగ్రత్త!
WhatsApp Verification Code : మీ వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్‌ను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి. ఒకవేళ మీ వెరిఫికేషన్ కోడ్‌ను ఇతరులకు చెబితే.. వాళ్లు మీ అకౌంట్‌ను ఇతర డివైజ్‌లలో యాక్సెస్ చేసి, మీ వ్యక్తిగత సమాచారాన్ని అపహరించే అవకాశం, ప్రమాదం ఉ
Thanks for reading Whatsapp restore : Lost your phone?.. Restore WhatsApp account with these simple tips!
No comments:
Post a Comment