ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రేపు(శనివారం) డీఏ విడుదల ఉత్తర్వులు వెలువడనున్నాయి. 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు.
జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన భద్రత కల్పిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ చట్టానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ అమలు చేయనున్నారు. పదవి విరమణ సమయంలో మూల వేతనం లో 50 శాతం పెన్షన్ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది.
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
కాగా, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ జారీ చేశారు.
Thanks for reading Dussehra gift for AP Govt employees
No comments:
Post a Comment