Indian Navy SSC Officer Recruitment 2023 Out for 224 Vacancies, Notification PDF
NAVY SSC: ఇండియన్ నేవీలో 224 ఎస్ఎస్‌సీ ఆఫీసర్లు
Navy: భారత నౌకాదళంలో 224 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత నౌకాదళం... షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ) జూన్ 2024లో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ పొందుతారు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా నౌకాదళంలో ప్రవేశాలుంటాయి. అభ్యర్థులు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది.
బ్రాంచి/ కేడర్ వివరాలు…
ఎగ్జిక్యూటివ్ బ్రాంచి:
1. జనరల్ సర్వీస్/ హైడ్రో కేడర్: 40 పోస్టులు
2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 08 పోస్టులు
3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 18 పోస్టులు
4. పైలట్: 20 పోస్టులు
5. లాజిస్టిక్స్: 20 పోస్టులు
ఎడ్యుకేషన్ బ్రాంచి:
6. ఎడ్యుకేషన్: 18 పోస్టులు
టెక్నికల్ బ్రాంచి:
7. ఇంజినీరింగ్ బ్రాంచి(జనరల్ సర్వీస్): 30 పోస్టులు
8. ఎలక్ట్రికల్ బ్రాంచి(జనరల్ సర్వీస్): 50 పోస్టులు
9. నావల్ కన్‌స్ట్రక్టర్: 20 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 224.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100తో పాటు ఇతర అలవెన్సులు.
ఎంపిక విధానం: డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండర్డ్స్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-10-2023.
Thanks for reading Indian Navy SSC Officer Recruitment 2023 Out for 224 Vacancies, Notification PDF
No comments:
Post a Comment