ONGC Scholarship for UG/ PG Courses
Oil and Natural Gas Corporation Limited, New Delhi invites applications form Male/Female candidates for Scholarship for UG/ PG Courses for the academic year 2023-24.
Details:
* ONGC Scholarship for GEN/ OBC/ SC/ ST Category
Courses: UG/ PG.
Age limit: Not be more than 30 years of age as on 16-10-2023.
Income Criteria: Income not to exceed 2 lakh Per Annum.
Eligibility: UG Courses- Candidate should have obtained minimum 60% marks in the 12th class for Engineering and MBBS disciplines. Similarly 60% marks are necessary in graduation for P.G courses i.e Geology/ Geophysics/ MBA. PG Courses- Candidate should have obtained minimum 60% marks in graduation for P.G courses i.e Geology/ Geophysics/ MBA.
ONGC: యూజీ, పీజీ కోర్సులకు ఓఎన్‌జీసీ ఉపకారవేతనాలు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫౌండేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి ఉపకార వేతన పథకం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, పీజీ(జియాలజీ/ జియో ఫిజిక్స్) కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించేందుకు ఈ స్కీమ్‌ను ఉద్దేశించారు. మొత్తం రెండు వేల స్కాలర్‌షిప్‌లు కేటాయించారు. అర్హులైన జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనం అందిస్తారు. ఎంపికైనవారికి ఏడాదికి రూ.48,000 చొప్పున కోర్సు పూర్తయ్యేంత వరకు ఉపకారవేతనం అందిస్తారు. జనరల్‌కు 500, ఓబీసీలకు 500, ఎస్సీ/ ఎస్టీలకు 1000 చొప్పున స్కాలర్‌షిప్‌లు విడి విడిగా ఇస్తున్నారు.
వివరాలు...
యూజీ, పీజీ కోర్సులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ స్కీం 2023-24.
ఎవరికోసం: భారతదేశంలో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.
అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్ (బీఈ/ బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ.. వీటిలో ఏ కోర్సునైనా అభ్యసిస్తున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు. వయసు 16-10-2023 నాటికి 30 ఏళ్లు దాటకూడదు.
ఎంపిక: అభ్యర్థి చేరిన కోర్సు ఆధారంగా ఇంటర్ లేదా డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేయాలి. అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30.
Last date for online application: 30-11-2023.
Thanks for reading ONGC Scholarship for UG/ PG Courses
No comments:
Post a Comment