APSRTC Apprentice Recruitment 2023 – Apply Online for Apprentice Posts
APSRTC Jobs : రాతపరీక్ష లేకుండా. 309 ఖాళీల భర్తీకి APSRTC నోటిఫికేషన్ విడుదల. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు.
APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ- 309 అప్రెంటిస్ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), కింది ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 309 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది.
ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులకు కర్నూలులోని ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపిక చేయనున్నారు.
కర్నూలు జోన్ పరిధిలోని జిల్లాలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య.
ఖాళీల వివరాలు:
అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్: 309 ఖాళీలు
జిల్లాల వారీగా ఖాళీలు: కర్నూలు- 49, నంద్యాల- 50, అనంతపురం- 52, శ్రీసత్యసాయి- 40, కడప- 67, అన్నమయ్య- 51.
ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్.
అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ: 01-11-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2023
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 16-11-2023
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ప్రిన్సిపల్, ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.
ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.
వివరాలకు: 08518-257025, 7382869399, 7382873146.
Thanks for reading APSRTC Apprentice Recruitment 2023 – Apply Online for Apprentice Posts
No comments:
Post a Comment