Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, November 29, 2023

LIC Jeevan Utsav


 LIC Jeevan Utsav: ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం

LIC jeevan utsav full details: ఎల్‌ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు.

LIC jeevan utsav | కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ముకు భద్రత, ప్రతిఫలం కోరుకోవడం సహజం. అదే సమయంలో కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తికి జరగరానిది ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసానివ్వడం కోసం బీమా కూడా అవసరం. ఈ రెండూ కలయికలో ఇప్పటికే ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) పలు పాలసీలను తీసుకొచ్చింది. అయినా అధిక ప్రతిఫలం కోసం తమ సొమ్మును మదుపరులు ఇతరత్రా పెట్టుబడి సాధనాల్లో మదుపు చేస్తున్నారు. ఈ క్రమంలో పొదుపు+ బీమాతో పాటు గ్యారెంటీ రిటర్న్స్‌తో ఎల్‌ఐసీ ఓ కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదే జీవన్‌ ఉత్సవ్‌ ( LIC Jeevan Utsav). ప్లాన్‌ నంబర్‌ 871 (Plan No. 871). నవంబర్‌ 29న ఈ పాలసీని లాంచ్‌ చేసింది. ఇదో నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌, జీవితాంతం బీమా అందించే పాలసీ. ఒకసారి ఈ పాలసీ తీసుకుంటే.. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత జీవితాంతం ఆదాయం పొందొచ్చు. హామీ మొత్తంలో 10 శాతం ఆదాయంగా చెల్లిస్తారు. ఇదో లిమిటెడ్‌ ప్లాన్. ఈ ప్లాన్‌ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రధాన ఫీచర్లు ఇవే.. ( LIC Jeevan Utsav)

ప్రీమియం టర్మ్‌, వెయిటింగ్‌ పీరియడ్‌ తర్వాత ఏటా ఆదాయం

రెగ్యులర్‌ ఆదాయం వద్దనుకుంటే ఫ్లెక్సీ విధానం ఎంచుకునే వెసులుబాటు. తద్వారా చక్రవడ్డీ ప్రయోజనం

పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవచి ఉన్నంత వరకు బీమా సదుపాయం. 

ప్రీమియం చెల్లించే కాలానికి రూ.1000కు రూ.40 చొప్పున గ్యారెంటీ అడిషన్స్‌

90 రోజుల చిన్నారుల నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ పాలసీలో చేరొచ్చు. 

వివిధ రైడర్లను ఎంచుకోవచ్చు. రుణ సదుపాయం కూడా ఉంది.

అర్హులు వీరే.. ( LIC Jeevan Utsav)

ఈ పాలసీని మైనర్లు, మేజర్లు, స్త్రీ, పురుషులు ఎవరైనా తీసుకోవచ్చు. కనీస ప్రవేశ వయసు 90 రోజులు. గరిష్ఠ వయసు 65 సంవత్సరాలు. పాలసీ చెల్లింపునకు గరిష్ఠ వయసు 75 సంవత్సరాలు. 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ఠ బీమా మొత్తం రూ.5 లక్షలు. ఎంచుకున్న కాలవ్యవధిని బట్టి వెయిటింగ్ పీరియడ్‌ ఉంటుంది. ఐదేళ్లు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే 6 సంవత్సరాలు ఎంచుకుంటే 4 సంవత్సరాలు; 7 సంవత్సరాలు ఎంచుకుంటే 3 సంవత్సరాలు; 8-16 సంవత్సరాలు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే 2 ఏళ్ల పాటు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. వెయిటింగ్‌ పీరియడ్‌ తర్వాత ఎల్‌ఐసీ నుంచి బీమా హామీ మొత్తంలో ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం ఆదాయం పొందొచ్చు. జీవించి ఉన్నంతకాలం జీవిత బీమా హామీ ఉంటుంది.

సర్వైవల్‌ బెనిఫిట్స్‌

ప్రీమియం చెల్లింపు, వెయిటింగ్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత పాలసీదారుడికి జీవితాంతం ఈ ప్లాన్‌ కింద ప్రయోజనాలు లభిస్తాయి.  ఈ ప్లాన్‌లో రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఒకటి రెగ్యులర్‌ ఆదాయం. రెండోది ఫ్లెక్సీ ఆదాయం. మొదటి ఆప్షన్‌ ఎంచుకుంటే ఏటా చివర్లో బేసిక్‌ మొత్తం నుంచి 10 శాతం ఆదాయం వస్తుంది. అదే ఆప్షన్‌-2 ఎంచుకుంటే.. బీమా మొత్తంలో 10 శాతం ప్రతిఫలం అందుతుంది. ఈ మొత్తం ఎల్‌ఐసీ వద్దనే ఉంచితే 5.5 శాతం చొప్పున చక్రవడ్డీ జమ అవుతుంది. ఈ మొత్తాన్ని తీసుకోకుండా ఉంచితే చక్రవడ్డీ ప్రభావంతో పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కావాలంటే జమ అయిన మొత్తం నుంచి 75 శాతం ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన మొత్తానికి వడ్డీ లభిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు bv జమ అయిన మొత్తం, డెత్‌ బెనిఫిట్స్‌ను నామినీకి చెల్లిస్తారు.  (LIC Jeevan Utsav)

డెత్‌ బెనిఫిట్‌

పాలసీదారుడు అకాల మరణం చెందితే డెత్‌ బీమా మొత్తం+ గ్యారెంటీడ్‌ అడిషన్స్‌ను ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. డెత్‌ బీమా మొత్తం లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్లు ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని  నామినీకి  చెల్లిస్తుంది. పాలసీ చెల్లింపు కాలవ్యవధికి ప్రతి రూ.1000లకు రూ.40 చొప్పున గ్యారెంటీ అడిషన్స్‌ కింద చెల్లిస్తామని ఎల్‌ఐసీ హామీ ఇస్తోంది. 

రైడర్లు ఇవే..

ఈ పాలసీకి ( LIC Jeevan Utsav) రైడర్లను సైతం యాడ్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఎల్‌ఐసీ యాక్సిడెంటల్‌ డెత్‌, డిజెబిలిటీ బెన్‌ఫిట్‌ రైడర్‌; ఎల్‌ఐసీ యాక్సిడెంట్‌ బెన్‌ఫిట్‌ రైడర్‌; ఎల్‌ఐసీ న్యూటర్మ్‌ అస్యూరెన్స్‌ రైడర్‌; ఎల్‌ఐసీ న్యూ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెన్‌ఫిట్‌ రైడర్‌; ఎల్‌ఐసీ ప్రీమియం వెయివర్‌ బెన్‌ఫిట్ రైడర్‌ను ఈ పాలసీకి యాడ్‌ చేసుకోవచ్చు.

ప్రీమియం ఎంత?

( LIC Jeevan Utsav) ఈ పాలసీ తీసుకోవాలంటే కనీస బీమా మొత్తం రూ.5 లక్షలు. ఆపై ఎంత మొత్తమైనా హామీ మొత్తంగా ఎంచుకోవచ్చు. 30 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఐదేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ ఎంచుకుంటే ఏటా రూ.2.17 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 8 ఏళ్ల ప్రీమియం ఆప్షన్‌ ఎంచుకుంటే.. రూ.1.43 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 16 ఏళ్ల ప్రీమియం టర్మ్‌ ఎంచుకుంటే.. ఏడాదికి రూ.58 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వయసును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. అలాగే, ప్రీమియం చెల్లించే వ్యవధి పెరిగితే చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. 

(LIC Jeevan Utsav) పాలసీ వివరాలు ఉదాహరణతో..

ఉదాహరణకు A అనే వ్యక్తి వయసు 25 ఏళ్లు అనుకుందాం. 12 ఏళ్ల ప్రీమియం టర్మ్‌కు రూ.10 లక్షల కనీస హామీ మొత్తంపై పాలసీ తీసుకుంటే.. ఏటా రూ.86,800 చెల్లించాలి. 12 ఏళ్ల పాలసీ టర్మ్‌ అంటే 36 ఏళ్లు వయసు వచ్చే వరకు ఈ మొత్తం చెల్లించాలి. రెండేళ్ల వెయిటింగ్‌ పీరియడ్‌ తర్వాత అంటే 38 ఏట నుంచి రెగ్యులర్‌ ఆదాయం మొదలవుతుంది. బీమా మొత్తంలో 10 శాతం అంటే  లక్ష రూపాయల చొప్పున ఏటా ఆదాయం వస్తుంది. అదే రెండో ఆప్షన్‌ ఎంచుకుంటే.. ఫ్లెక్సీ ఆదాయం కింద ఆ మరుసటి ఏడాది 5.5 శాతం వడ్డీ జమ అవుతుంది అంటే.. 1.05 లక్షలు అవుతుంది. ఆపై ఏటా జమ అయ్యే మొత్తంపై 5.5 శాతం చొప్పున వడ్డీ ఆదాయం లభిస్తుంది. A వయసు 60 సంవత్సరాలు వచ్చే సరికి రూ.22 లక్షలు రెగ్యులర్‌ ఆదాయం వస్తుంది. అదే ఫ్లెక్సీ ఆప్షన్ ఎంచుకుంటే.. రూ.22 లక్షలతో పాటు చక్రవడ్డీ రూపంలో వచ్చిన మొత్తంతో కలిపి రూ.43.11 లక్షలు సమకూరుతుంది. పాలసీదారుడు ఎప్పుడైనా సమకూరిన మొత్తంలోచి 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆపై మిగిలిన మొత్తంపై వడ్డీ వస్తుంది. 

కొనుగోలు ఎక్కడ?

ఎల్‌ఐసీ జీవన్‌ ఉత్సవ్‌ ( LIC Jeevan Utsav) పాలసీని ఎల్‌ఐసీ ఏజెంట్‌ ద్వారా గానీ, ఆన్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయొచ్చు. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంది. పాలసీ చెల్లింపు సమయంలోనూ, ఆదాయం మొదలైన తర్వాత కూడా రుణం తీసుకోవచ్చు. అయితే, అప్పుపై చెల్లించే వడ్డీ, రెగ్యులర్‌ ఆదాయంలో 50 శాతం మించకూడదు. ప్రీమియం నెలనెలా, మూడు నెలలకోసారి, ఆరు నెలలకు, సంవత్సరానికి ఓసారి చొప్పున చెల్లించొచ్చు.

నోట్‌: ఈ వివరాలు ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. పాలసీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి. లేదంటే ఎల్‌ఐసీ ఏజెంట్‌/ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, మీ సమీపంలోని ఎల్‌ఐసీ ఆఫీస్‌ను సంప్రదించండి. పాలసీ బ్రోచర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Thanks for reading LIC Jeevan Utsav

No comments:

Post a Comment