Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, November 1, 2023

Professor posts: Notification for filling 3,220 posts in universities


 Professor Posts: విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్‌

* ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల‌కు ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం

* దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20 వరకు గడువు

* వర్సిటీ యూనిట్‌గా రిజర్వేషన్లు

 విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అక్టోబ‌రు 30న‌ రాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్‌లాగ్‌, 2,942 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు వేటికవే ప్రకటనలు విడుదల చేశాయి. వీటిలో ప్రొఫెసర్‌ పోస్టులు 418, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 801, ట్రిపుల్‌ఐటీల లెక్చరర్‌ పోస్టులతో కలిపి సహాయ ఆచార్యుల పోస్టులు 2,001 ఉన్నాయి. దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్‌ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. స్క్రీనింగ్‌ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. పోస్టుల భర్తీకి 2017, 2018ల్లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినందున కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు వర్సిటీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కోర్టు తీర్పునకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని వెల్లడించాయి. వర్సిటీ యూనిట్‌గా కొత్తగా రిజర్వేషన్‌ రోస్టర్‌ పాయింట్లతో పోస్టులను ప్రకటించాయి. అసోసియేట్‌ ఆచార్యులు, ప్రొఫెసర్‌ పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉండదు. విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేపడతారు.

భారీగా దరఖాస్తు ఫీజు

అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టుకు ఒక్కో దరఖాస్తుకు రూ.3వేలు దరఖాస్తు ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 18 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయాలంటే రూ.54 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రెండు, మూడు సబ్జెక్టులకు అర్హత ఉన్న వ్యక్తులయితే దరఖాస్తులకే రూ.లక్ష చెల్లించాల్సి వస్తుంది. సహాయ ఆచార్యుల పోస్టుకు సంబంధించి ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రతి తప్పునకు ఒక మైనస్‌ మార్కు

స్క్రీనింగ్‌ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, ఒక తప్పునకు ఒక మైనస్‌ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్‌ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Website Here

Thanks for reading Professor posts: Notification for filling 3,220 posts in universities

No comments:

Post a Comment