Railway RRC NER Apprentice Recruitment 2023 Apply For 1104 Vacancies
RRC: నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1,104 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్ ఈస్ట్రన్ రైల్వే… ఎన్‌ఈఆర్ పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
డివిజన్/వర్క్‌షాప్: మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్), సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్), బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్), మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్), డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్), డీజిల్ షెడ్ (గోండా), క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి).
ఖాళీల వివరాలు:
యాక్ట్ అప్రెంటిస్: 1,104 ఖాళీలు
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, పెయింటర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్.
వయోపరిమితి: 25.11.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 24.12.2023
Thanks for reading Railway RRC NER Apprentice Recruitment 2023 Apply For 1104 Vacancies
No comments:
Post a Comment