Scholarship: పేద విద్యార్థులకు ‘ఎస్‌బీఐ ఆశా’ దీపం.. ₹10,000 స్కాలర్‌షిప్!
చదువులో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎస్‌బీఐ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన విద్యార్థులు నవంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..
SBIF Asha Scholarship: విద్యలో ప్రతిభకనబరిచే పేద విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ఎస్‌బీఐ ఫౌండేషన్ తన వంతు సహకారం అందిస్తోంది. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులను ఎంపిక చేసి వారి చదువులకు ఆర్థికసాయం అందిస్తోంది. ఎస్‌బీఐఎఫ్ ఆశా స్కాలర్‌షిప్(SBIF Asha Scholarship)కు దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద విద్యార్థులకు రూ.10వేలు స్కాలర్‌షిప్ అందిస్తారు. అర్హులైన విద్యార్థులు నవంబర్ 30లోగా ఆన్‌లైన్ https://www.sbifoundation.in/focus-area-detail/SBIF-Asha-Scholarshipలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
స్కాలర్‌షిప్‌కు అర్హతలివే..
ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి.
దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రూ.3లక్షలు మించరాదు.
ఏయే డాక్యుమెంట్లు సమర్పించాలి?
గత విద్యాసంవత్సరానికి సంబంధించిన మార్కుల షీట్; ప్రభుత్వ గుర్తింపు కార్డు( ఆధార్ వంటివి); ప్రస్తుత సంవత్సరంలో అడ్మిషన్‌కు సంబంధించిన ఆధారాలు (ఫీజు రిసీట్, అడ్మిషన్ లెటర్/స్కూల్ ఐడీ కార్డు/బోనఫైడ్ సర్టిఫికెట్); ఆదాయానికి సంబంధించిన ఆధారాలు (ఫామ్ 16ఏ/ఆదాయ ధ్రువీకరణ పత్రం/ శాలరీ స్లిప్); దరఖాస్తు దారు ఫొటో
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ స్కాలర్‌షిప్‌నకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ-మెయిల్/మొబైల్ నంబర్/జీమెయిల్ ఖాతాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును పూర్తి చేసే సమయంలో అడిగిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. నిబంధనలను అంగీకరించిన అనంతరం ప్రివ్యూపై క్లిక్ చేసి మనం నమోదు చేసిన వివరాలన్నీ సరిగా వున్నాయో లేదో చెక్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అకడమిక్ మెరిట్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. వచ్చిన దరఖాస్తులను అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా స్కాలర్‌షిప్ మొత్తాన్ని జమ చేస్తారు. ఇది వన్‌టైమ్ స్కాలర్‌షిప్ మాత్రమే.
ఏవైనా సందేహాలు తలెత్తితే 011-430-92248 (Ext: 303) నంబర్‌ను సంప్రదించవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సంప్రదించవచ్చు. లేదా sbiashascholarship@buddy4study.com ఈ మెయిల్ చేయవచ్చు.
Thanks for reading SBIF Asha Scholarship for School Students 2023
No comments:
Post a Comment