Bank Holidays In January2024 : జనవరి నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!
Bank Holidays In January 2024: మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపిఐ వంటి డిజిటల్ సేవలు ఎంత అందుబాటులోకి వచ్చినా.. కొన్ని అత్యవసర సేవల కోసం బ్యాంకుల్ని సందర్శించడం తప్పనిసరి అవుతుంది.
ఆయా పనుల్లో బ్యాంకుల్లోనే పూర్తవుతాయి. అలాంటి వారి కోసమే ఈ వార్త. ఎందుకంటే.. రాబోయే జనవరి నెలలో ఏకంగా 16 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. సాధారణ సెలవుల దగ్గర నుంచి ఫెస్టివల్ హాలిడేస్ దాకా.. మొత్తం 16 రోజుల వరకు బ్యాంకులు భౌతికంగా అందుబాటులో ఉండవు. కేవలం ఆన్‌లైన్ సేవలు మాత్రమే ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. కాబట్టి.. బ్యాంకులకు వెళ్లాలని అనుకునేవారు.. ఈ 16 రోజులు మాత్రం అస్సలు వెళ్లకండి.
* జనవరి 01 (సోమవారం) - నూతన సంవత్సరం రోజు
* జనవరి 07 (ఆదివారం)
* జనవరి 11 (గురువారం) - మిషనరీ డే (మిజోరం)
* జనవరి 12 (శుక్రవారం) - స్వామి వివేకానంద జయంతి (పశ్చిమ బెంగాల్)
* జనవరి 13 (శనివారం) - రెండవ శనివారం
* జనవరి 14 (ఆదివారం)
* జనవరి 15 (సోమవారం) - పొంగల్/తిరువల్లువర్ డే (తమిళనాడు & ఆంధ్రప్రదేశ్)
* జనవరి 16 (మంగళవారం) - తుసు పూజ (పశ్చిమ బెంగాల్ & అస్సాం)
* జనవరి 17 (బుధవారం) - గురు గోవింద్ సింగ్ జయంతి
* జనవరి 21 (ఆదివారం)
* జనవరి 23 (మంగళవారం) - నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
* జనవరి 25 (గురువారం) - రాష్ట్ర దినోత్సవం (హిమాచల్ ప్రదేశ్)
* జనవరి 26 (శుక్రవారం) - గణతంత్ర దినోత్సవం
* జనవరి 27 (శనివారం) - నాల్గవ శనివారం
* జనవరి 28 (ఆదివారం)
* జనవరి 31 (బుధవారం) - మీ-డామ్-మీ-ఫై (అస్సాం)
జనవరిలో ఈ 16 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండగా.. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2), క్రిస్మస్ (డిసెంబర్ 25) వంటి ముఖ్యమైన సెలవులు కూడా ఉన్నాయి. అదనంగా.. దీపావళి, దసరా, ఈద్, గణేష్ చతుర్థి, బుద్ధ పూర్ణిమ, ఇతర మతపరమైన పండుగలలో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే.. ఈ పండుగల తేదీలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. సాధారణంగా బ్యాంకు సెలవులు అనేవి భారతదేశం అంతటా స్థిరంగా ఉంటాయి. అయితే స్థానిక ఆచారాలు, సంస్కృతుల కారణంగా కొన్ని రాష్ట్రాలలో వేర్వేరుగా నిర్దిష్ట పబ్లిక్ సెలవులున్నాయి. ఆ సెలవుల వివరాలు తెలుసుకోవడం కోసం.. రాష్ట్రంలోని స్థానిక మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది.
రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి.
ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.
Thanks for reading Bank Holidays In January2024
No comments:
Post a Comment