TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 4, 2023

Cyclone names: Who gives names to cyclones.. Who decides these..? What are the terms?


Cyclone names: Who gives names to cyclones.. Who decides these..?  What are the terms

 తుపాన్లకు పేర్లు పెట్టేందుకూ ఓ విధానం

తీరం వైపు దూసుకొస్తున్న మిగ్‌జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను కుదిపేస్తోంది. రెండు రాష్ట్రాలను ఇంతగా వణికిస్తున్న ఈ తుపానుకు మిగ్‌జాం అనే పేరును మయన్మార్‌ సూచించింది. ఈ పేరుకు అర్థం.. బలం, పుంజుకునే శక్తి అని వెల్లడించింది.

గాలుల వేగం 61 కి.మీ. ఉంటేనే నామకరణం

 తీరం వైపు దూసుకొస్తున్న మిగ్‌జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను కుదిపేస్తోంది. రెండు రాష్ట్రాలను ఇంతగా వణికిస్తున్న ఈ తుపానుకు మిగ్‌జాం అనే పేరును మయన్మార్‌ సూచించింది. ఈ పేరుకు అర్థం.. బలం, పుంజుకునే శక్తి అని వెల్లడించింది. తుపాన్లకు పేరు పెట్టేందుకు ప్రధాన కారణం.. హెచ్చరికలకు బాగా ఉపయోగపడుతుందనే. అంతేకాకుండా భవిష్యత్తులో ఆ తుపాను నష్టం గురించి చర్చించేందుకూ, పరిశోధకులు అధ్యయనం చేసేందుకు సులువుగా ఉంటుంది. అయితే గంటకు కనీసం 61 కి.మీ. వేగంతో కూడిన గాలులతో తుపానులు సంభవించినప్పుడే వాటికి పేర్లు పెడతారు.

ఎప్పుడు మొదలైంది?

తుపాన్లకు పేరు పెట్టే సంప్రదాయాన్ని 2000వ సంవత్సరంలో ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఆసియా అండ్‌ పసిఫిక్‌’, ప్రపంచ వాతావరణ సంస్థలు సంయుక్తంగా ప్రతిపాదించాయి. సుదీర్ఘ చర్చల తర్వాత 2004లో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. ఆసియాలో ఏర్పడే తుపాన్లకు హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13 దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి.  ఇందులో భారత్‌, బంగ్లాదేశ్‌, మల్దీవులు, ఒమన్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక దేశాలు ఉన్నాయి. అయితే ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాలలో ఏర్పడే ఈ తుఫాన్లకు ఈ పేర్లను పెడుతుంటారు. 2018లో ఇరాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్‌ దేశాలూ ఈ గ్రూపులో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్‌ తుపాన్లకు ముందే పేర్లను నిర్ణయిస్తుంది. ఈ పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. జాబితాలో మొదటిపేరు బంగ్లాదేశ్‌ కాగా, భారత్‌ది రెండోపేరు. ఉత్తర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో పుట్టే తుపాన్లకు పేర్లను భారత వాతావరణ శాఖ కేంద్రం ప్రకటిస్తుంది.

27వ సదస్సులో తుఫాన్ పేర్లపై ఒప్పందం

2000వ సంవత్సరంలో 27వ సదస్సును మస్కట్‌, ఓమన్‌దేశాల్లో నిర్వంచారు. ఇందులో తుఫాన్లకు పేర్లను పెట్టడంపై ఒప్పందం జరిగింది. ఇక పలుమార్లు సభ్యదేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత 2004 సెప్టెంబరులో తుఫానులకు నామకరణం చేయడం ప్రారంభమైంది. అయితే బంగాళాఖాతం, అరేబియన్‌ సముద్రాల తీరంలో ఉన్న ఎనిమిది దేశాలను ముందుగా గుర్తించారు. ఇంగ్లీష్‌లోని ఆల్ఫబెటిక్ ఆర్డర్ ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలను పొందుపర్చారు.

అయితే ఢిల్లీలోని వాతావరణ కేంద్రం కొన్ని పేర్లను ముందుగానే నిర్ణయిస్తుంటుంది. రానున్న తుఫానుకు ఒక పేరును సూచించాలని సభ్యదేశాలను కోరుతుంది. ఇది అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీరంలో ఉన్న సభ్య దేశాలకు పంపుతుంది. తుఫానులకు పేర్లుపెట్టడం వల్ల అధికారులు, శాస్త్రవేత్తలు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతోపాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. తుఫాన్లకు పేరు పెట్టే సంస్కృతికి అమెరికా తెరలేపింది.

కాగా, ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టారు. 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. మొత్తం 64 పేర్లను ఈ ఎనిమిది దేశాలు ఎంపిక చేయగా ఇప్పటికి 57 పేర్లను ఆయా తుఫాన్లకు నామకరణం చేసేశారు. భారత్ సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలి, ఆకాష్ ఉండగా, మలా అనే పేరును శ్రీలంక సూచించింది. ఇక హెలెన్ అనే పేరును బంగ్లాదేశ్ నామకరణం చేయగా, నీలోఫర్‌ పాకిస్తాన్ పెట్టింది.

తుఫాన్ల పేర్లు పెట్టడంతో పాటించాల్సిన నిబంధనలు

ఈ తుఫాన్ల పేర్లు రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి. ఇష్టానుసారంగా పెట్టేందుకు వీలు లేదు.

సభ్యదేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి.

తుఫాన్ల పేర్లలో క్రూరత్వం ఎక్కడ ఉండకూదు.

ఈ తుఫాన్ల పేర్లుపలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉండేలా చూడాలి.

ఈ పేరు ఇంగ్లీషులో ఎనిమిది అక్షరాలకంటే ఎక్కువ ఉండరాదు.

పేరు ప్రతిపాదించడంతోపాటు దాని స్పెల్లింగ్‌, ఉచ్ఛారణను ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్య దేశాలదే.

సభ్యదేశాలు సూచించిన పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్‌కు అధికారం ఉంటుంది.

ఒకసారి ప్రకటించిన పేర్ల జాబితాలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు.

ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లకు పెట్టిన పేర్లను ఒక్కసారి మాత్రమే వాడాలి. మరోసారి వాడకూడదు.

మనమూ తుపానుకు పేరు పెట్టొచ్చు..!

భారత్‌ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో తుపాన్లకు సామాన్య ప్రజలూ పేరు సూచించొచ్చు. ఈ పేర్లు అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎవరి మనోభావాలూ గాయపడని విధంగా, చిన్నగా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆసక్తి ఉన్నవారు దిల్లీలో ఉన్న భారత వాతావరణ శాఖకు లేఖ ద్వారా పేరు సూచించవచ్చు.



Thanks for reading Cyclone names: Who gives names to cyclones.. Who decides these..? What are the terms?

No comments:

Post a Comment