NIACL: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 300 అసిస్టెంట్ పోస్టులు
ముంబయిలో ప్రధాన కేంద్రంగా గల ప్రభుత్వ రంగ సంస్థ- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్... దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వివరాలు:
* అసిస్టెంట్: 300 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
జీత భత్యాలు: నెలకు సుమారు రూ.37,000.
వయోపరిమితి: 01-01-2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-02-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.
గమనిక: ప్రకటన సమగ్ర వివరాలు ఫిబ్రవరి 1వ తేదీన అందుబాటులో రానున్నాయి..
Thanks for reading Jobs in New India Assurance Company Limited (NIACL)
No comments:
Post a Comment