CBSE Exams: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ ఇలా..
సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి పరీక్షల అడ్మిట్ కార్డులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి.
CBSE Exams Admit Cards : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పది, 12వ తరగతి పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షలు రాసేందుకు సన్నద్ధమైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అడ్మిట్ కార్డులను పొందొచ్చు. పరీక్ష సంగమ్ పోర్టల్‌లో లాగిన్ కావడం ద్వారా పాఠశాలలు విద్యార్థుల అడ్మిట్ కార్డుల్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి పొందొచ్చు. అడ్మిట్ కార్డులో రోల్ నంబర్, పరీక్ష కేంద్రం పేరు, రిపోర్టు చేయాల్సిన సమయంతో పాటు విద్యార్థులకు పలు కీలక సూచనలు ఉంటాయి. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై మార్చి 13తో ముగియనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ఆరంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నాయి.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
Thanks for reading CBSE Exams Admit Cards
No comments:
Post a Comment