Loksabha Elections: మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ పోలింగ్
దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Loksabha elections schedule
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024)కు నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు.
ఏపీ, తెలంగాణలో ఒకే రోజున లోక్‌సభ పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు.
లోక్‌సభ ఎన్నికలు ఇలా..
లోక్‌సభ: తొలి దశ
నోటిఫికేషన్: 20 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి
నామినేషన్ల పరిశీలన: 28 మార్చి
ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19
లోక్‌సభ : రెండో విడత
నోటిఫికేషన్: 28 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 04
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 5వ తేదీ
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 8
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 26
లోక్‌సభ: మూడో దశ
నోటిఫికేషన్: ఏప్రిల్ 12, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 20
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 22
పోలింగ్ తేదీ: మే 7
లోక్‌సభ: నాలుగో విడత
నోటిఫికేషన్: ఏప్రిల్ 18, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 26
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ: మే 13
లోక్‌సభ: ఐదో విడత
నోటిఫికేషన్: ఏప్రిల్ 26, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3
నామినేషన్ల పరిశీలన: మే 4
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 6
పోలింగ్ తేదీ: మే 20
లోక్‌సభ: ఆరో విడత
నోటిఫికేషన్: ఏప్రిల్ 29, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 6
నామినేషన్ల పరిశీలన: మే 7
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 9
పోలింగ్ తేదీ: మే 25
లోక్‌సభ: ఏడో విడత
నోటిఫికేషన్: మే 7, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 14
నామినేషన్ల పరిశీలన: మే 15
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 17
పోలింగ్ తేదీ: జూన్ 1
Thanks for reading Loksabha elections schedule
No comments:
Post a Comment