Navodaya Vidyalaya Samiti (NVS) Recruitment 2024 | 1377 non - Teaching Posts
NVS: నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టులు
నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి... డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎన్‌వీఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న ఎన్‌వీఎస్ ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్‌ఎల్‌ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. ఫిమేల్ స్టాఫ్ నర్స్: 121 పోస్టులు
2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు
3. ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు
4. జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 4 పోస్టులు
5. లీగల్ అసిస్టెంట్: 1 పోస్టు
6. స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు
7. కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు
8. క్యాటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు
9. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు
10. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు
11. ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు
12. మెస్ హెల్పర్: 442 పోస్టులు
13. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 1,377.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.
దరఖాస్తు విధానం: కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500.
ముఖ్య తేదీలు:
దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 26, 2024.
దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 29, 2024. .... 14.05.24
Thanks for reading Navodaya Vidyalaya Samiti (NVS) Recruitment 2024 | 1377 non - Teaching Posts
No comments:
Post a Comment