The Bharat Electronics Limited (BEL) Engineer Recruitment 2024: Apply for 517 Trainee Engineer posts at bel-india.in
BEL: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో 517 ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్ అండ్ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ప్రకటన వివరాలు:
* ట్రైనీ ఇంజినీర్: 517 పోస్టులు
కేటగిరీ రిజర్వేషన్: అన్ రిజర్వ్‌డ్- 210; ఓబీసీ- 139; ఈడబ్ల్యూఎస్- 52; ఎస్సీ- 77; ఎస్టీ- 39.
బెల్ జోన్‌ల వారీ ఖాళీలు: సెంట్రల్- 68, ఈస్ట్- 86, వెస్ట్- 139, నార్త్- 78, నార్త్ ఈస్ట్- 15, సౌత్- 131.
అర్హత: బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 55% మార్కులు అవసరం; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఉత్తీర్ణత చాలు.
గరిష్ఠ వయోపరిమితి: బీఈ/ బీటెక్ అభ్యర్థులకు 28 ఏళ్లు. ఎంఈ/ ఎంటెక్ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.150, 18% జీఎస్‌టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.03.2024.
Thanks for reading The Bharat Electronics Limited (BEL) Engineer Recruitment 2024: Apply for 517 Trainee Engineer posts at bel-india.in
No comments:
Post a Comment