North Eastern Railway application begins for 1104 Apprentice posts; here’s all the details
RRC: నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1104 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- నార్త్ ఈస్ట్రన్ రైల్వే… ఎన్‌ఈఆర్ పరిధిలోని కింది యూనిట్లలో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వర్క్‌షాప్/ యూనిట్: మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్), సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్), బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్), మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్), డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్), డీజిల్ షెడ్ (గోండా), క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి).
ఖాళీల వివరాలు:
* యాక్ట్ అప్రెంటిస్: 1104 ఖాళీలు
ట్రేడ్: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.06.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక ఏడాది.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-07-2024.
Thanks for reading North Eastern Railway application begins for 1104 Apprentice posts; here’s all the details
No comments:
Post a Comment