AP TET: ఏపీ టెట్ షెడ్యూల్‌లో మార్పులు
* ఆగస్టు 3 వరకు దరఖాస్తు గడువు
AP TET 2024| అమరావతి: రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ (Mega DSC)కి సిద్ధమైన ఏపీ సర్కార్ మరోసారి టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 2న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్‌లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని అక్టోబర్ 3 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.
సవరించిన టెట్ షెడ్యూల్:
టెట్ నోటిఫికేషన్ విడుదల : జులై 2
పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా.. ఆగస్టు 3 వరకు..
ఆన్‌లైన్ దరఖాస్తులు: ఆగస్టు3 వరకు
ఆన్‌లైన్ మాక్‌టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులోకి
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: సెప్టెంబర్ 22 నుంచి
పరీక్షలు: అక్టోబర్ 3 నుంచి 20వరకు (రెండు సెషన్లలో)
ప్రొవిజినల్ కీ : అక్టోబర్ 4న
ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 5 నుంచి
తుది కీ విడుదల: అక్టోబర్ 27
ఫలితాలు విడుదల: నవంబర్ 2న
Thanks for reading AP TET: Changes in ap tet schedule
No comments:
Post a Comment